అంతర్మథనంలో పీసీసీ చీఫ్...పదవి కోల్పోయే ప్రమాదం ఉందని చర్చ

అంతర్మథనంలో పీసీసీ చీఫ్...పదవి కోల్పోయే ప్రమాదం ఉందని చర్చ
x
Highlights

పార్టీలో మరోసారి పీసీసీ పదవి మారుతుందని జోరుగా ప్రచారం జరుగుతుండడంతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా తగ్గిన సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి...

పార్టీలో మరోసారి పీసీసీ పదవి మారుతుందని జోరుగా ప్రచారం జరుగుతుండడంతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా తగ్గిన సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు సీనియర్లంతా విమర్శిస్తుండడం అధిష్టానం పల్స్ అందకపోవడంతో పార్టీలో అనేక చర్చలు జరుగుతున్నాయి. పదవీ గండం ఉందనే వార్తలతో యాత్ర షెడ్యూల్ పై దృష్టి సారించలేకపోతున్నాడనే ప్రచారం పార్టీలో జరుగుతోంది.

తెలంగాణ కాంగ్రెస్ అధినేత ఉత్తమ్ కుమార్ రెడ్డిలో మొదట ఉన్న ధీమా ఇప్పుడు కనిపించడం లేదు. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకొని ప్రజా చైతన్యయాత్రను ప్రారంభించారు ఉత్తమ్. బడ్జెట్ సమావేశాల తరువాత బస్సుయాత్ర ప్రారంభించాలని పార్టీ ముఖ్యనేతలంతా సలహాలు ఇచ్చినా ఉత్తమ్ మాత్రం హడావిడిగా తాను అనుకున్నట్టే యాత్రను ప్రారంభించారు.

మొదటి విడత యాత్ర హడావిడిగా ప్రారంభించడంతో ప్రత్యేక బస్సును సిద్ధం కాలేదు. రెండో విడతకు చెన్నైలో ప్రత్యేకంగా తయారైన ప్రత్యేక బస్సు తెప్పించారు. కానీ ఇప్పటి వరకు ఆ బస్సు ఊసే లేదు. ఇక మొదటి విడతలో కనిపించిన ప్రత్యక్ష ప్రసారాలు మలి దశ యాత్రలో కాన రావడం లేదు.

రెండో విడత బస్సుయాత్ర కరీంనగర్, వరంగల్ , ఖమ్మం జిల్లాల్లో ఉంటుందని ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10 వరకు జరగాల్సిన యాత్ర ముందుగానే ముగిసేలా ఉంది. స్టేషన్ ఘణపూర్, వరంగల్ ఈస్టు, ములుగు నియోజకవర్గాల్లో యాత్ర వాయిదా వేశారు. ఇంకా ఎన్ని మార్పులుంటాయోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పార్టీలో సీనియర్లకు షాకిస్తూ అధిష్టానం యువతకు పెద్దపీట వేస్తుండటంతో పీసీసీ పీఠానికి కొత్త వారిని ఎంపిక చేయొచ్చనే చర్చ జోరుగా సాగుతోంది. దీంతో ఆరంభంలో ఉత్సాహంగా బస్సుయాత్ర ప్రారంభించిన ఉత్తమ్ నీరుగారి పోయారని ఇక బ్రేక్ పడటమే తరువాయనే గుసగుసలు పార్టీలో వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories