దూకుడు పెంచేందుకు రెడీ అవుతున్న ఉత్తమ్

Submitted by arun on Thu, 01/11/2018 - 11:18
uttam

తెలంగాణ కాంగ్రెస్‌లో ఉత్తమ్‌‌కు తిరుగులేదా ? ఆయన కెప్టెన్సీలోనే కాంగ్రెస్‌ పార్టీ 2019 ఎన్నికలకు వెళ్తుందా ? ఉత్తమ్‌ పనితీరుపై అధిష్టానం సంతృప్తిగా ఉందా ? అంటే అవునంటున్నాయ్ కాంగ్రెస్‌ వర్గాలు. ఉత్తమ్‌కు రెండో పీసీసీ చీఫ్‌గా కొనసాగించడమే ఇందుకు ప్రత్యక్షసాక్ష్యమంటున్నారు. 

తెలంగాణ సర్కార్‌ ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికపుడు ఎండగడుతూ...కాంగ్రెస్‌ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. టీఆర్‌ఎస్‌తో ఢీ అంటే ఢీ అంటోంది. అయినప్పటికీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ను మారుస్తారని ప్రచారం జరిగింది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డినే మరోసారి పీసీసీ చీఫ్‌‌గా కొనసాగిస్తూ కాంగ్రెస్‌ యువరాజు రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆనందం వ్యక్త చేస్తూనే 2019లో పార్టీని అధికారంలోకి తీసుకొస్తామన్నారు.

పీసీసీ పదవి కోసం లాబీయింగ్‌ చేసుకుంటున్న నేతలపై నీళ్లు చల్లారు రాహుల్ గాంధీ. ఉత్తమ్‌ను రెండోసారి కొనసాగించడంతో మంచి సంకేతాలు ఇచ్చారన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. హైకమాండ్‌ నిర్ణయంతో ఉత్తమ్‌ దూకుడు పెంచేందుకు రెడీ అవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. సంక్రాంతి తర్వాత కమిటీలను వేసేందుకు..ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. 

హైక‌మాండ్ నిర్ణయంతో ఉత్తమ్ వ‌ర్గం ఉత్సాహంతో ఉర‌క‌లేస్తుంటే... ఇప్పటి వరకు ఆ ప‌దవి కోసం ఆశ‌ప‌డ్డ నేతలు ఢీలాపడ్డారు. ఇక చేసేదేం లేక ఇప్పుడు ఉత్తమ్‌తో క‌లిసి న‌డ‌వాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. అయితే ఇది తాత్కలికమేనని...సర్ది చెప్పేప్రయత్నం చేస్తున్నారు. త్వరలో మార్పులు జరుగుతాయని మేకపోతు గాంభిర్యం ప్రదర్శిస్తున్నారు . 

English Title
Uttam Kumar Reddy to continue as PCC chief

MORE FROM AUTHOR

RELATED ARTICLES