పాపాల ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం- ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Submitted by santosh on Mon, 05/14/2018 - 11:23
uttam kumar reddy

సింగరేణి కార్మికులను తెలంగాణ ప్రభుత్వం మోసం చేసిందన్నారు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. మిర్చికి గిట్టుబాటు ధర అడిగిన పాపానికి రైతులకు బేడీలు వేసిన ఘనత టీఆర్ఎస్‌ ప్రభుత్వానిదేనని విమర్శించారు. పాపాల ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ జోరు పెంచింది. వీలయినంత ఎక్కువ సమయం ప్రజల్లో ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే రెండు పర్యాయాలు బస్సు యాత్రలు నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ...మూడో విడతలో భాగంగా మంచిర్యాలలో బహిరంగ సభ నిర్వహించింది. సింగరేణి కార్మికుల భిక్షతో గెలిచిన కేసీఆర్‌....అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని మోసం చేశారని ఆరోపించారు. వారసత్వ ఉద్యోగాలు, ఇండ్ల నిర్మాణం, ఆదాయ పన్ను మినహాయింపు వంటి అంశాల ఊసెత్తడం లేదు.

నాలుగేళ్ల కేసీఆర్‌ పాలనలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేదని...గిట్టుబాటు ధర అడిగిన పాపానికి జైలుకు పంపిన ఘనత కేసీఆర్‌దేనని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. గిట్టుబాటు ధర ఇవ్వని ప్రభుత్వం రైతు బంధు పథకం పేరుతో రైతులను మోసం చేస్తూ....ఆర్బాటం చేసుకోవడం తప్పా ప్రయోజనం శూన్యం అన్నారు. 14 లక్షల మంది కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయల రుణమాఫీతో పాటు నిరుద్యోగ యువత ...ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ కాంగ్రెస్‌ నేతలు ప్రచారం చేస్తున్నారు. 
 

English Title
uttam kumar reddy

MORE FROM AUTHOR

RELATED ARTICLES