అమెరికా వీసా ఆశావహులకు శుభవార్త..

Submitted by nanireddy on Tue, 05/29/2018 - 09:20
us-announces-15000-additional-visas-foreign-workers

అమెరికా వీసా ఆశావహులకు శుభవార్త చెప్పింది ట్రంప్ సర్కార్.. అమెరికాలో పనిచేసేందుకు వీలుగా హెచ్‌-2బీ వీసాలను సుమారు 15 వేలమంది నాన్ అగ్రికల్చర్ వర్కర్లకు జారీచేయనున్నట్టు  డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యురిటీ ప్రకటించింది. కాగా ఇప్పటికే 2018 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జారీ చేసిన 66వేల వీసాల కంటే అదనంగా ఈ 15 వేల వీసాలు జారీ చేస్తున్నట్టు సెక్రటరీ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యురిటీ కిర్స్టేజెన్ నీ నీల్సన్ చెప్పారు. తమ దేశంలో నాన్ అగ్రికల్చర్ (ఇతర రంగాల్లో) ఉద్యోగుల కొరత ఉండటం వలన   ఇతర దేశాల వర్కర్లకు తాత్కాలిక ఆహ్వానం పలుకుతున్నట్టు అయన తెలిపారు.. ఇదిలావుంటే గరిష్టంగా ఈ ఏడాది ప్రథమార్థంలో 33వేల హెచ్‌-2బీ వీసాలు అందుబాటులో ఉంచామని , మరో 33వేలు వీసాలను అదనంగా మరో 15 వేల వీసాలను ద్వితీయార్థంలో (జూన్ లేదా జులైలో) అందుబాటులోకి తేనున్నట్టు హోమ్‌ల్యాండ్‌ సెక్యురిటీ పేర్కొంది. 

English Title
us-announces-15000-additional-visas-foreign-workers

MORE FROM AUTHOR

RELATED ARTICLES