భార్య అశ్లీల వీడియోను చూసిన భర్త ఏం చేశాడంటే..

Submitted by arun on Fri, 08/03/2018 - 13:09
punjab, illegal affair

అక్రమ సంబంధాలు అంతానికే పూనుకుంటాయని తెలిసి కూడా చాలా మంది అలాంటి వ్యవహారాల్లో దలదూర్చి చివరకు ప్రాణాల మీదకు తెచ్చకుంటున్నారు. అలాంటి ఘటనే పంజాబ్‌లో చోటు చేసుకుంది. భార్య ఇంకొకరితో అశ్లీలంగా వున్న వీడియోను చూసిన భర్త ఆవేశంతో భార్యాపిల్లల మీద పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు.  వివరాల్లోకి వెళ్తే.. కపుర్తలా జిల్లా కలసింగియా గ్రామానికి చెందిన కుల్విందర్‌ సింగ్‌(35) జోర్డాన్‌లో పని చేస్తూ నెలకు డబ్బులు ఇంటికి పంపిస్తున్నాడు. భార్య, పిల్లలు స్వగ్రామం కలసింగియాలోనే ఉంటున్నారు. అయితే గ్రామంలోని ఓ వ్యక్తితో కుల్విందర్‌ భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో సదరు వ్యక్తితోపాటు మరో ముగ్గురు ఆమె అశ్లీల వీడియోను రికార్డు చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారు. చివరకు ఆ వీడియోను భర్తను పంపటంతో కుల్విందర్‌ ఇండియాకు తిరిగొచ్చాడు. భార్య వ్యవహారం బయటపడటంతో తట్టుకోలేక పెట్రోల్‌ పోసి కుటుంబాన్ని చంపి, తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు కపుర్తలా పోలీసులు వెల్లడించారు.

English Title
Upset over wife's suspected affair, NRI man burns alive self, wife and 2 kids over 'sleazy' video in Kalasingia village

MORE FROM AUTHOR

RELATED ARTICLES