మామ డ్యూటి చేస్తున్న రామ్ చరణ్: ఉపాసన

Submitted by arun on Fri, 10/12/2018 - 12:46
bdy

సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటూ, తన గురించి, తన భర్త రామ్ చరణ్ గురించిన కబుర్లను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కు చేరవేసే ఉపాసన పెట్టిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఏ విధమైన సినిమా షూటింగ్ లో లేని రామ్ చరణ్, కుటుంబంతో గడుపుతూ, తన మేనకోడలి పుట్టిన రోజు వేడుకను దగ్గరుండి ఘనంగా జరిపించాడు. ఈ విషయాన్ని ఉపాసన ట్విటర్ ద్వారా తెలిపారు. తన మేనకోడలితో చెర్రీ కేక్ కట్ చేయించే పిక్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఉపాసన.. ‘మామ డ్యూటీస్.. హ్యాపీ బర్త్ డే’ అని ట్వీట్ చేశారు. ఆ పిక్‌లో చెర్రీ మేనకోడలితో పాటు అల్లు ఆయాన్, మరికొందరు చిన్నారులు కనిపిస్తున్నారు. అయితే ఆ పిక్‌లో ఆయాన్ ఎక్కువగా హైలెట్ అవుతున్నాడు. కేక్‌నే చూస్తున్న ఆయాన్‌ను చూసి ‘అల్లువారబ్బాయి దృష్టంతా కేక్‌పైనే ఉంది’ అంటూ అభిమానులు సరదాగా స్పందిస్తున్నారు.

Mama duties 😘 - happy birthday ! #ramcharan pic.twitter.com/kXxHvvKisf

— Upasana Kamineni (@upasanakonidela) October 11, 2018
English Title
upasana post ramcharan photo

MORE FROM AUTHOR

RELATED ARTICLES