ఉన్నావ్ రేప్ కేసులో బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్...

Submitted by arun on Fri, 04/13/2018 - 10:54
Kuldeep Singh

ఉన్నావ్  రేప్ ఘటనలో మరో అడుగు ముందుకు పడింది. మొత్తానికి నిందితుడు, అధికార పార్టీ ఎమ్మెల్యే కులదీప్ సెంగార్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ తెల్లవారుజామున నాలుగున్నర గంటల సమయంలో లక్నోలో అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు అతన్ని హజ్రత్ గంజ్ లోని సీబీఐ ఆఫీస్ కు తరలించారు. అతనిపై గతంలోనే పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. యోగి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆయన్ని అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. ఇవాళ కులదీప్‌ను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

గతేడాది జూన్‌లో ఎమ్మెల్యే తనపై అత్యాచారానికి పాల్పడ్డారనీ... సంవత్సరం నుంచి పోరాడుతున్నా అధికారులు తనకు న్యాయం చేయలేదని బాధితురాలు ఆరోపించింది. అత్యాచారంపై కేసు వెనక్కి తీసుకోవాలంటూ ఈ నెల 3న ఎమ్మెల్యే సోదరుడు, అతడి అనుచరులు బాధితురాలి తండ్రిని చెట్టుకు కట్టేసి దారుణంగా చావబాదినట్టు ఆమె కుటుంబం పేర్కొంది. బాధితురాలి తండ్రి ఈ నెల 8న పోలీసు కస్టడీలోనే మృతి చెందడంతో మొత్తం ఆరుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది.

English Title
Unnao rape case: BJP MLA Kuldeep Singh Sengar detained by CBI

MORE FROM AUTHOR

RELATED ARTICLES