జయహో గుండు బాస్

Highlights

ప్రతి ఇంట్లో టీవీ ఆన్ చేయగానే మిలమిల మెరిసే గుండుతో నగల ధరలు కంపార్ చేసేటప్పుడు ఆ నగల ధర అలా ఉంది. వర్క్ మెన్ షిప్ ఇలా ఉందని మార్కెట్లో కన్ ఫ్యూజ్...

ప్రతి ఇంట్లో టీవీ ఆన్ చేయగానే మిలమిల మెరిసే గుండుతో నగల ధరలు కంపార్ చేసేటప్పుడు ఆ నగల ధర అలా ఉంది. వర్క్ మెన్ షిప్ ఇలా ఉందని మార్కెట్లో కన్ ఫ్యూజ్ చేస్తున్నారా..? లలితా జ్వువెలరీలో మీకు నచ్చిన నగదుకు ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి. ఆ నగను మొబైల్ కూడా ఫోటో తీసుకోండి. రెండింటిని పెట్టుకొని నాలుగైదు షోరూంలో కంపార్ చేయండి. ఎక్కడ ధర తక్కువ ఉంటే అక్కడే కొనండి. డబ్బులు ఈజీగా రావు . ఇంత వరకు ఎక్కవ డబ్బులు ఇచ్చింది చాలంటూ గుండు బాస్ తన మాటలతో ప్రత్యర్ధులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. మాటలే పెట్టుబడి. ప్రచారం స్టైల్. బ్రాండ్ మీద నమ్మకం, ప్రత్యర్ధుల బంగారం భాగోతం గురించి పదే పదే చెబుతుంటే ఆయన క్రేజ్ మరింత పెరిగింది. ఆయన ఎవరో కాదు లలితా జ్వువెలర్ చైర్మన్ కిరణ్ కుమార్. నున్నటి గుండుతో ఇతను చెప్పే మాటలు బంగారం లెక్క ఉంటాయి కాబట్టే ఆ షోరూం కే వెళుతున్నామని కొనుగోలు దారులు చెబుుతున్నారు.

అయితే సాదారణ పనివాడిగా మొదలుపెట్టి నేడు అంచెలంచెలుగా ఎదిగి 1500మందికి ఉద్యోగాలిచ్చిన చదువులేని కిరణ్ కుమార్ ఆత్మకథ ప్రతి ఒక్కరికి ఆదర్శమే. ఆర్ధిక ఇబ్బందుల వల్ల చదువుకోలేకపోయినా ఎదగాలనే కసి, కృషి పెట్టుబడిగా లలితా జ్వువెలర్ యజమాని నేటి తరానికి మార్గదర్శి. రాజస్థాన్ లో తాతముత్తాతలు ఉన్నా కిరణ్ కుమార్ నెల్లూరు లోనే జన్మించారు. చదువు అబ్బక, కనబడిన పనల్లా చేసుకుంటూ చివరకి ఓ బంగారు షాపులో పనికి కుదిరాడు. అక్కడ నిజాయతీగా, శ్రద్దగా పనిచేసుకుంటూనే వ్యాపారంలో మెళుకువలు నేర్చుకున్నాడు. అలా రోజులు గడిచే కొద్ది కిరణ్ కుమార్ కి తానే సొంతంగా వ్యాపారం చేయాలని ఆలోచన వచ్చింది. పూటగడవాడినికైతే ఫర్వాలేదు కానీ వ్యాపారం చేసేంత స్థోమత పెట్టుబడి తన దగ్గరలేవు . ఆ దశలో తన తల్లి వద్ద ఉన్న బంగారు గాజుల్ని అమ్మేసి వచ్చిన ఆ కొద్ది డబ్బులకు తోడు అమ్మ ఆశీస్సులతో బిజినెస్ మొదలు పెట్టాడు. అప్పట్లో చెన్నైల్లో ఉండే లలితా జ్వువెలరికి వెళ్లి తాను డిజైన్ చేసిన నగల్ని తీసుకెళ్లి అమ్మేవాడు. వాటిని జనం మోజు పడి కొనుక్కోవడంతో కిరణ్ కుమార్ లో ఉత్సాహం రెట్టింపైంది. ఇక లలితా జ్వువెలర్ వద్దనుంచే కాకుండా ఇతర బంగారు షాపుల నుంచి ఆర్డర్లు తెచ్చుకొని కష్టమర్లను ఆకట్టుకునే రీతిలో కొత్తకొత్త మోడళ్లలో వివిధ రకాల బంగారు ఆభరణాల్ని అమ్మేవారు. హోం డెలివరీ కూడా ఇచ్చేవారు. నమ్మకానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. అలా రోజురోజుకు అతను పుంజుకున్నాడు.

ఈ నేపథ్యంలో లలితా జ్వువెలర్ యాజమాన్యం ఒడిదుడుకులతో దివాళ తీసే స్థాయికి చేరుకుంది. అమ్మేద్దామని ఆ యాజమాన్యం భావించడంతో దాన్ని కిరణ్ కుమార్ సొంతం చేసుకున్నారు. అప్పటి నుంచి కసిగా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే పనిలో నిమగ్నమైపోయాడు. చూస్తుండగానే లక్షలు, కోట్లకు చేరుకుంది. 12 బ్రాంచీలు, 1800 మంది ఉద్యోగులు, 10వేలకోట్ల లాభాలతో లలితా లలితా జ్వువెలర్ విజయ పథాకంలో దూసుకెళ్తుంది.

35మంది తో తాను లలితా లలితా జ్వువెలర్ ను సొంతం చేసుకున్నాడు. నేడు 1500మంది స్టాఫ్ ఉన్నారు. కానీ ఆ సంస్థకు ఎండీ, ఛైర్మన్ అని చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. లలితా జ్వువెలర్ ఇంటి పెద్దగానే వ్యవహరించాడు. ఇంతలా తన సామ్రాజ్యాన్ని స్థాపించుకున్న కిరణ్ తరువాత.. ఏంటిని అడిగితే నవ్వుతూ సమాజసేవ అని చెబుతున్నాడు. 2018తరువాత తన సంపదలో సగం పూర్తిగా సేవాకార్యక్రమాలకు వినియోగిస్తానని వినయంగా చెబుతున్నారు. ఇంతకీ మీ విజయ రహస్యం ఏంటంటే తన పట్ల కొనుగోలు దారుల నమ్మకం, వ్యాపారంలో ఎన్నికష్టనష్టాలు వచ్చినా నిజాయితీని విడవకపోవడం, తక్కువ మజూరు ఛార్జీలు, తరుగు, వీలైనంత తక్కువ ధరకే బంగారాన్ని విక్రయించడంలాంటివి తన సక్సెస్ సీక్రెట్స్ అంటున్నాడు. ఎదగాలనే కసి , ఎదుగుతామనే నమ్మకం, నిరంతరం శ్రమ, మొండి పట్టుదల, కాస్త తెగువ, ఇంకాస్త చొరవ ఉండాలేకానీ ఎవరైనా తనలాగే విజయసాధిస్తామని నేటి తరానికి స్పూర్తి నింపుతున్నాడీ గుండు బాస్

Show Full Article
Print Article
Next Story
More Stories