అడాల్ఫ్ హిట్లర్ కు ఆ సన్నివేశం అంటే చాలా భయం

Submitted by lakshman on Thu, 02/08/2018 - 00:35
unknown about adolf hitler

జ‌ర్మ‌నీ యూదుల ఊచకోత నుంచి ప్రాణాలతో బయటపడిన అతి కొద్దిమందిలో ఇవా ష్క్లాస్ ఒకరు. ఆనాటి పరిస్థితులను భావి తరాలకు అందించేందుకు ఆమె తన వంతు కృషి చేస్తున్నారు. యూదుల ఊచకోత సమయంలో తాను ఎదుర్కొన్న పరిస్థితులను రికార్డు చేస్తున్నారు. 3 డైమెన్షనల్ ఇంటరాక్టివ్ టెక్నాలజీని ఉపయోగించి, గతాన్ని పొందుపరుస్తున్నారు. అంటే ఎవరైనా వర్చ్యువల్‌గా ఆమెను ప్రశ్నలు అడిగి.. ఆనాటి ఘటనలను, అప్పటి పరిస్థితులను తెలుసుకోవచ్చు. ఇంతకీ.. ఇవా ష్క్లాస్ ఎవరో తెలుసా? 'ద డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్' పుస్తక రచయిత, ఏన్ని ఫ్రాంక్‌కి స్టెప్ సిస్టర్. ఎనభై ఎనిమిదేళ్ల ఇవా ష్క్లాస్.. ఔష్ విట్జ్ మారణహోమం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ఆమె తన గతాన్ని వివరిస్తూ, దాన్ని చిత్రీకరిస్తున్నారు. ఇప్పటి ప్రజలకే కాదు, భవిష్యత్ తరాలకు కూడా చరిత్రను భద్రంగా అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా అప్పటి యూదుల ఊచకోత గురించి, వర్చ్యువల్‌గా ఆమెను ప్రశ్నలు అడిగి తెలుసుకోవచ్చు. ఆమె వెల్ల‌డించిన వివ‌రాల ఆధారంగా
అడాల్ఫ్ హిట్లర్ జర్మనీ నియంత. నరనరాన జాత్యహంకారం జీర్ణించుకుపోయిన ఈ వ్యక్తి రెండో ప్రపంచ యుద్ధ కాలంలో 60లక్షల మంది యూదు తెగకు చెందిన ప్రజల్ని అత్యంత కిరాతంగా చంపేశాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో గాయపడిన జర్మనీ సైనికుడే హిట్లర్. ఈ యుద్ధం తరువాత జర్మనీ ఎదుర్కొన్న విపత్కర పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు.  తన మాటలతో అణగారిన సామాన్య ప్రజల్ని ఉత్తేజవంతుల్ని చేసి  జర్మనీ పతనానికి యూదులే కారకులని వారిని క్రూరంగా చంపేసిన ఘనత ఈయనదే. అయితే ఇలాంటి కిరాతకుడికి ఓ భయం ఉండేది. ప్రేమ ఉండేది. అదే మూగ జీవాల్ని ప్రేమించడం. మనుషుల్ని కిరాతకంగా చంపేసి..మూగజీవాలతో సాన్నిహిత్యంతో వాటిని ప్రేమిస్తాడు. మూగజీవాల్ని ఎవరు ఏమన్నాకఠినంగా శిక్షించేవాడు. అంతేకాదండోయ్ తాను టీవీ చూస్తున్నప్పుడు మూగజీవాల్ని హింసించే సన్నివేశాలు చూడాలంటే భయపడేవాడంట. కళ్లుమూసుకునే వాడట. ఎవరైనా ఆ సన్నివేశం అయిపోయిందంటే మళ్లీ కళ్లు తెరిచేవాడట. కాగా సోవియట్ రష్యా కు చెందిన రెడ్ ఆర్మీ  దాడి గురించి తెలుసుకున్న హిట్లర్ ఆ ముందురోజే వివాహం చేసుకున్న తన భార్య ఇవా బ్రౌన్ తో కలిసి ఒక నేలమాళిగలో ఏప్రిల్ 30, 1945 మధ్యాహ్నం 3.30 కి ఆత్మ హత్య చేసుకొన్నాడు.   

English Title
unknown about adolf hitler

MORE FROM AUTHOR

RELATED ARTICLES