పార్లమెంట్‌కు చేరిన బడ్జెట్‌..!

Submitted by arun on Thu, 02/01/2018 - 10:36
Union Budget 2018

వార్షిక బడ్జెట్‌ 2018-19 పత్రాలు పార్లమెంట్‌కు వచ్చాయి. గురువారం ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అంతకు ముందే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తన నివాసం నుంచి నార్త్‌బ్లాక్‌లో ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఆయన బడ్జెట్‌ తయారీ బృందంతో భేటీ అయ్యారు. అనంతరం  రాష్ట్రపతి భవన్‌ చేరుకున్నారు. అక్కడ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో ఆయన సమావేశమయ్యారు. అనంతరం అక్కడి నుంచి పార్లమెంట్‌కు చేరుకున్నారు.

కేబినెట్‌ భేటీ.. బడ్జెట్‌కు ఆమోదం : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం ఉదయం కేంద్ర కేబినెట్‌ ప్రత్యేకంగా భేటీ అయింది. ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ నేడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఉదయం 11 గంటలకు ఉభయసభలు ప్రారంభంకానున్నాయి.

English Title
union budget papers arrives parliament

MORE FROM AUTHOR

RELATED ARTICLES