2018-19 బడ్జెట్‌లో ముఖ్యాంశాలు

2018-19 బడ్జెట్‌లో ముఖ్యాంశాలు
x
Highlights

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ 2018-19 ఏడాదికిగాను కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఏప్రిల్‌ 1, 2018 నుంచి ప్రారంభంకానున్న ఆర్థిక సంవత్సరానికి...

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ 2018-19 ఏడాదికిగాను కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఏప్రిల్‌ 1, 2018 నుంచి ప్రారంభంకానున్న ఆర్థిక సంవత్సరానికి ఆయన గురువారం ఉదయం లోక్‌సభలో 11గంటలకు బడ్జెట్‌ను ప్రసంగ పాఠాన్ని మొదలుపెట్టారు. జైట్లీ బడ్జెట్‌ ప్రవేశ పెట్టడం ఇది ఐదోసారి. ఎన్డీయే సర్కార్‌కు ఇది పూర్తిస్థాయి ఆఖరి బడ్జెట్‌. 2019లో సాధారణ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌ కేంద్రానికి అతిముఖ్యమైనది కాగా ఇదే ఏడాది ఎనిమిది రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌కు ప్రాధాన్యం సంతరించుకుంది. మరోపక్క, కేంద్రం జీఎస్‌టీని గత ఏడాది అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత వస్తున్న తొలి బడ్జెట్‌ కూడా ఇదే. ఈ నేపథ్యంలో ఆ బడ్జెట్‌లోని ప్రధాన అంశాలు మీ కోసం..

జైట్లీ ప్రసంగంలో ప్రధానాంశాలు:

  • గ్రామీణ వ్యవసాయ, విద్యారంగాలపై ప్రత్యేక దృష్టి
  • ఈజ్ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో 43వ స్థానానికి చేరుకున్నాం
  • పేద, మధ్యతరగతి వర్గాల ఆదాయాలు పెరుగుతున్నాయి
  • ఉజ్వల, సౌభాగ్యయోజన పథకాల ప్రస్తావన
  • పేదలకు ఉచిత డయాలసిస్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి
  • గ్రూప్‌-సి, డి ఉద్యోగాలకు ఇంటర్వ్యూ లేకుండా చేశాం....లబ్ధిదారులకు ప్రయోజనాలు అందేలా అన్ని చర్యలు
  • 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపునకు చర్యలు
  • వ్యవసాయ ఉత్పత్తులు పెరిగి రైతులకు లాభాలు పెరగాలి
  • వ్యవసాయం లాభసాటి వృత్తి కావాలి
  • రబీలో మద్దతు ధర పెంచాం
  • మార్కెట్‌ ధర ఎంఎస్‌పీ కన్నా తక్కువగా ఉంటే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
  • 86 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే
  • గ్రామీణ వ్యవసాయ మార్కెట్లు ఏర్పాటు
  • గ్రామీణ మార్కెట్లలో 2వేల కోట్లతో మౌలికసదుపాయాల అభివృద్ధి
  • ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన ఫేజ్‌-3 లో అన్ని వాతావరణాలను తట్టుకునేలా రోడ్లు నిర్మిస్తాం
  • ఉద్యానవన పంటలపై ప్రత్యేక దృషి
  • సేంద్రీయ వ్యవసాయంలో మహిళా రైతులకు పెద్దపీట
  • కుటీర పరిశ్రమల్లో అత్తరు లాంటి ఉత్పత్తుల కోసం రూ.200 కోట్లు కేటాయింపు
  • ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలకు రూ.1400 కోట్లు
  • ఆలు, ఉల్లి ఉత్పత్తి పెంచేందుకు ఆపరేషన్‌ గ్రీన్
  • 42 మెగా ఫుడ్‌ పార్కులలో అత్యాధునిక సౌకర్యాలు
  • మత్స్య, పశుసంవర్ధక రంగాల వారికి కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు
  • వెదురు ఉత్పత్తికి రూ.1290 కోట్లు
  • మిగులు సౌర విద్యుత్‌ను కంపెనీలు కొనేలా చర్యలు
  • మత్స్య‌, పశుసంవర్ధకశాఖల్లో రూ.10వేల కోట్ల నిధి
  • వ్యవసాయ రుణాలు 11 లక్షల కోట్లకు పెంపు
  • ఢిల్లీ పరిసరాలలో వాయు కాలుష్య నియంత్రణకు ప్రత్యేక పథకం
  • రైతులు పంటలు తగలబెట్టకుండా చర్యలు
  • ఉజ్వల యోజన కింద 8 కోట్ల మంది మహిళలకు గ్యాస్‌కనెక్షన్లు
  • స్వచ్ఛభారత్‌ కింద 2 కోట్ల మరుగుదొడ్లు నిర్మించడమే లక్ష్యం
  • పేదల గృహ వసతి కోసం 51 లక్షల ఇళ్ల నిర్మాణం
  • 2017 నుంచి 1.02 కోట్ల ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నాం
  • 96 వెనుకబడిన జిల్లాలో ప్రతి చేనుకు సాగు నీరు పథకం
  • వితంతువులు, అనాథలు, దివ్యాంగుల సామాజిక అభివృద్ధికి చర్యలు
  • ఉపాధ్యాయుల శిక్షణ కోసం ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సులు
  • గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి ఏకలవ్య పాఠశాలలు
  • నాలుగేళ్లలో లక్ష కోట్లతో విద్యాభివృద్ధికి రైజ్‌ పథకం
  • ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ కోసం రెండు విద్యాలయాలు
  • 1000 మంది బీటెక్‌ విద్యార్థుల కోసం ప్రధానమంత్రి రీసెర్చ్‌ ఫెలో పథకం
  • ఆయుష్మాన్‌ భారత్‌ కార్యక్రమంలో రెండు కొత్త పథకాలు
  • రూ.1200 కోట్లతో పేదల కోసం ఆరోగ్య కేంద్రాలు
  • నేషనల్‌ హెల్త్‌ ప్రొటెక్షన్‌ స్కీమ్‌ కింద 50 కోట్ల మందికి ప్రయోజనం
  • కుటుంబానికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా
  • ప్రతి ఒక్కరికి రూ.330 ప్రీమియంతో రూ.5లక్షల బీమా
  • టీబీ చికిత్స కోసం 600 కోట్లు కేటాయింపు
  • ప్రతి మూడు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఒక మెడికల్‌ కాలేజీ
  • ప్రధాని జీవన్‌ బీమా యోజన కింద 5.23 కోట్ల కుటుంబాలకు లబ్ధి
  • అన్ని కుటుంబాలకు జీవన బీమా యోజన
  • నమామీ గంగే పథకం కింద 47 పథకాలు పూర్తి
  • ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాలకు రూ.56 వేల కోట్లు
  • చిన్న సూక్ష్మ పరిశ్రమల పరపతికి రూ.3700 కోట్లు
  • 3 లక్షల కోట్ల ముద్ర రుణాలు
  • 2019 నాటికి మహిళా సంఘాలకు రూ.75వేల కోట్ల రుణాలు
  • జాతీయ జీవనోపాధి మిషన్‌కు రూ.5750 కోట్లు
  • కొత్త ఉద్యోగుల వేతనంలో ఈపీఎఫ్‌ కింద 12 శాతం కంట్రిబ్యూషన్‌
  • ప్రతి జిల్లాకేంద్రంలో నైపుణ్యశిక్షణ కేంద్రం
  • జౌళిరంగానికి 7148 కోట్లు కేటాయింపు
  • లడ్డాక్‌లో శేలాపాస్‌ దగ్గర సొరంగం నిర్మాణానికి చర్యలు
  • స్మార్ట్‌ సిటీ పథకం విజయవంతం
  • జాతీయరహదారుల అభివృద్ధి పథకాన్ని వేగవంతం చేస్తాం
  • 9వేల కి.మీ జాతీయరహదారుల నిర్మాణం
  • 5.35 లక్షల కోట్లతో 35000 కి.మీ రహదారుల నిర్మాణం
  • ప్రాంతీయ విమానయానరంగంలో 56 ఎయిర్‌పోర్టుల అభివృద్ధి
  • పర్యాటక రంగంలో ప్రైవేట్‌ పెట్టుబడుల ఆకర్షణ
  • డిజిటల్‌ ఇండియా కార్యక్రమానికి రెట్టింపు నిధులు
  • టెలికాం మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.10వేల కోట్లు
  • టోల్‌గేట్ల వద్ద పే యాజ్‌ యూ యూజ్‌ పథకం
  • రక్షణ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి దిశగా అడుగులు
  • రక్షణ రంగంలో దేశీయ ఉత్పత్తుల పెంపునకు 2018-19లో కొత్త విధానం
  • మూడు బీమా కంపెనీల విలీనం
  • పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలను అధిగమించాం
  • 2018-19లో 80 వేల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం

రైల్వే బడ్జెట్‌ కేటాయింపులు:

  • రైల్వే విద్యుద్దీకరణకు ప్రత్యేక ప్రాధాన్యం
  • 4 వేల కి.మీ విద్యుద్దీకరణ పనులు చేపట్టాం
  • రైల్వేభద్రతలో భాగంగా ట్రాక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు పెద్దపీట
  • 4200 మానవరహిత రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ల తొలగింపు
  • అన్ని రైళ్లలో వైఫై, సీసీ టీవీలు ఏర్పాటు చేయడమే లక్ష్యం
  • ముంబై లోకల్‌ రైళ్ల కోసం 90 కి.మీ మేర డబుల్‌ లైన్
  • ముంబై సబర్బన్‌ రైల్వేకు రూ.17వేల కోట్లు
  • బెంగళూరు మెట్రోకు రూ.17వేల కోట్లు
  • రైల్వేస్టేషన్ల పరిసరాలలో వాణిజ్య సముదాయాల అభివృద్ధి

ఏపీ కేటాయింపులు ఇవే:

  • ఏపీ సెంట్రల్ యూనివర్సిటీకి రూ.10 కోట్లు
  • ఏపీ నిట్‌కు రూ.54 కోట్లు
  • ఏపీ ఐఐటీకి రూ.50కోట్లు, ఐఐఎంకు రూ.42 కోట్లు
  • ఏపీలో ట్రిపుల్‌ ఐటీకి రూ.30 కోట్లు
  • ఏపీ ఐఐఎస్‌సీఆర్‌కు రూ.49కోట్లు
  • ఏపీ ట్రైబల్ యూనివర్సిటీకి రూ.10కోట్లు
  • ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌కు రూ.5కోట్లు
  • ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియంకు రూ.32 కోట్లు
  • డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు రూ.19.62 కోట్లు
  • విశాఖ పోర్టుకు రూ.108 కోట్లు
  • విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.1400 కోట్లు

తెలంగాణకు కేటాయింపులు:

  • తెలంగాణ ట్రైబల్ యూనివర్సిటీకి రూ.10 కోట్లు
  • హైదరాబాద్‌ ఐఐటీకి రూ.75 కోట్లు
  • సింగరేణికి రూ.2 వేల కోట్ల పెట్టుబడులు
Show Full Article
Print Article
Next Story
More Stories