ఉంగ‌రాల రాంబాబు రివ్యూ

ఉంగ‌రాల రాంబాబు రివ్యూ
x
Highlights

నిర్మాణ సంస్థ: యుౖనెటెడ్‌ మూవీస్‌(కిరీటి)లిమిటెడ్‌ నటీనటులు: సునీల్‌, మియా జార్జ్‌, ప్రకాష్‌రాజ్‌, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్‌, రాజీవ్‌ కనకాల,...

నిర్మాణ సంస్థ: యుౖనెటెడ్‌ మూవీస్‌(కిరీటి)లిమిటెడ్‌
నటీనటులు: సునీల్‌, మియా జార్జ్‌, ప్రకాష్‌రాజ్‌, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్‌, రాజీవ్‌ కనకాల, ఆశిష్‌ విద్యార్థి, హరితేజ తదితరులు
మాటలు: చంద్రమోహన్‌
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
ఛాయాగ్రహణం: సర్వేష్‌ మురారి
సంగీతం: జిబ్రాన్‌
నిర్మాత: పరుచూరి కిరీటి
రచన, దర్శకత్వం: కె.క్రాంతిమాధవ్‌

ఒకప్పుడు టాప్‌ కమెడియన్‌గా మెప్పించిన వారిలో సునీల్‌ ముందు వరుసలో ఉండేవాడు. కమెడియన్‌ నుంచి హీరోగా టర్న్‌ అయిన తర్వాత సునీల్‌ కెరీర్‌ చెప్పుకోదగ్గ హిట్‌ సినిమాలు అందాల రాముడు, మర్యాద రామన్న, పూలరంగడు. ఈ చిత్రాల తర్వాత సునీల్‌కు ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు. ఎలాౖగెనా మంచి హిట్‌ కొట్టాలనే ఉద్దేశంతో సునీల్‌, క్రాంతి మాధవ్‌తో జత కలిసి చేసిన కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌ 'ఉంగరాల రాంబాబు'. చక్కని సందేశాత్మక చిత్రంగా 'ఓనమాలు'ని రూపొందించి అందరి దృష్టినీ ఆకర్షించిన క్రాంతిమాధవ్‌ ఆ తర్వాత శర్వానంద్‌, నిత్యా మీనన్‌లతో 'మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు' వంటి స్వచ్ఛమైన ప్రేమకథను తెరకెక్కించాడు. మరి ఈ ఫస్ట్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'ఉంగరాల రాంబాబు' ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకుంది? సినిమా సునీల్‌ని పరాజయాల బారి నుంచి రక్షించిందా? అనే తెలియాలంటే కథ ఏంటో చూద్దాం.

కథ: చిన్నప్పుడే తల్లిదండ్రులు పోవడంతో రాంబాబు (సునీల్‌)ను అతని తాతయ్య (విజయ్‌కుమార్‌) పెంచి పెద్ద చేస్తాడు. ఒకరోజు రాంబాబు తాతయ్య కన్నుమూస్తాడు. 200 కోట్ల ఆస్థికి సమానంగా, అప్పులు కూడా ఉండటంతో రాంబాబుకి ఉన్నదంతా పోయి రోడ్డున పడతాడు. ఆ సమయంలో బాదంబాబా(పోసాని) ఇచ్చిన సలహాతో 200 కోట్లకు అధిపతిగా మారి, వచ్చిన డబ్బుతో పెద్ద ట్రావెల్‌ కంపెనీని పెడతాడు రాంబాబు. తన ఆఫీస్‌లో మేనేజర్‌గా ఉద్యోగం చేసే సావిత్రి(మియాజార్జ్‌)ను ప్రేమిస్తాడు. రాంబాబు, సావిత్రి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అయితే సావిత్రి పెళ్లికి ఆమె తండ్రి ఒప్పుకోవాలనుకునే కండీషన్‌ పెడుతుంది. అందుకని సావిత్రితో కలిసి రాంబాబు కేరళలో వుండే ఆమె తండ్రి రంగనాయర్‌(ప్రకాష్‌రాజ్‌) దగ్గరకి వెళ్తారు. కమ్యూనిస్ట్‌ భావాలున్న రంగనాయర్‌కు డబ్బున్న రాంబాబు నఃచ్చడు. ప్రేమ‌ కోసం రాంబాబు.. సావిత్రి వాళ్ల ఇంట్లోనే ఉండి ఆమె తండ్రిని పెళ్లికి ఒప్పించాలనుకుంటాడు. అప్పుడేం జరుగుతుంది? రాంబాబు, సావిత్రిని పెళ్లి చేసుకునే క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? చివరికి ఏౖమెంది అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

సమీక్ష: సింపుల్‌గా చెప్పుకున్న ఈ కథలో లక్షా తొౖంబె లొసుగులున్నాయి. పోయాయనుకున్న 200 కోట్లు సిల్లీగా బంగారం రూపంలో దొరకడం, దాంతో వ్యాపారం స్టార్ట్‌ చెయ్యడం దాన్ని 400 కోట్లు చేసెయ్యడం వఃంటి సన్నివేశాలు రియాలిటీకి కిలోమీటర్ల దూరంలో ఉండి ప్రేక్షకుడికి నవ్వాలో ఏడ్వాలో తెలియని పరిస్థితులను కల్పిస్తాయి. ముందు టైటిల్‌ 'ఉంగరాల రాంబాబు' అని వినగానే చక్కని ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు క్రాంతి మాధవ్‌ మార్క్‌ మెసేజ్‌ కూడా వుంటుందని అందరూ ఆశిస్తారు. సినిమా ప్రమోషనల్‌ కార్యక్రమాల్లో అదే విషయాన్ని చెప్పారు మరి. సునీల్‌ను కమెడియన్‌గా తన మార్కుతో అందర్నీ ఎంటర్‌టైన్ చేస్తాడని ప్రేక్షకులు ఊహిస్తారు. కానీ, అందుకు విరుద్ధంగా ఉంగరాలరాంబాబు సినిమా ఉండటం బాధాకరమే. ఓ రకంగా చెప్పాలంటే ఈ సినిమాని డిజాస్టర్‌గా తీర్చిదిద్దడంలో దర్శకుడుగానీ, నిర్మాతగానీ ఎక్కడా రాజీ పడలేదు. ఏ ఒక్క క్యారెక్టౖరెజేషన్‌ కూడా సమంజసం అనిపించదు. ఒక్కోసారి వెకిలి చేష్టలు చేసే రాంబాబు అప్పటికప్పుడే సెంటిమెంట్ డైలాగ్స్‌ చెప్పేస్తుంటాడు. సామాజిక స్పృహ వున్నవాడిలా దేశంలోని అన్ని సమస్యల గురించి చర్చిస్తాడు. హీరోయిన్‌ ఇంట్లోనే మందు కొడుతూ, సిగరెట్లు తాగుతూ హీరోయిన్‌ తండ్రి దగ్గర బ్యాడ్‌ అనిపించుకుంటాడు. ఇక హీరోయిన్‌ గురించి చెప్పాలంటే హీరో ఏది చేసినా సర్దుకుపోయే మనస్తత్వంతో వుంటుంది.

పొరుగు రాష్ట్ర‌మైన‌ కేరళలోని ఓ గ్రామంలో కమ్యూనిజాన్ని ఊళ్ళో అందరికీ నూరిపోసే క్యారెక్టర్‌. కార్పొరేట్‌ విధానాన్ని చీల్చి చెండాడుతూ వుంటాడు. ఫారిన్‌ కారు కనిపించినా సహించని క్యారెక్టర్‌. ఊళ్ళోవారి సమస్యల కోసం ఎప్పుడూ కలెక్టర్‌తో విభేదించే క్యారెక్టర్‌. తన సిద్ధాంతాలతో ఏం సాధించాడో మనకు అర్థం కాదు. సునీల్‌ కామెడీ చెయ్యడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ, అస్సలు సక్సెస్‌ అవ్వలేదు. మియా జార్జ్‌ కేవలం పాటలకే పరిమితమైపోయింది. ఒక అద్భుతౖమెన క్యారెక్టర్‌ చేస్తున్నాననుకున్న ప్రకాష్‌రాజ్‌ క్యారెక్టర్‌ కామెడీగా మారిపోయింది. సాంకేతిక విభాగాల గురించి చెప్పాలంటే సర్వేష్‌ మురారి ఫోటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి సీన్‌ని అందంగా చూపించాడు. జిబ్రాన్‌ మ్యూజిక్‌ విషయానికి వస్తే ఒక్క పాట కూడా వినసొంపుగా లేదు. దానికి తగ్గట్టుగానే పాటల పిక్చౖరెజేషన్‌ పరమ రొటీన్‌గా వుంది. బ్యాక్‌గ్రౌండ్‌ అస్సలు బాలేదు. సినిమా డైరెక్టర్‌ ఎవరంటే గతంలో ఓనమాలు, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు సినిమాల దర్శకుడు అని చెప్పాడానికి ప్రేక్షకుడే ఆలోచించేస్థాయిలో సినిమా ఉంది. అర్థం పర్థం లేని సీన్స్‌, అనవసరమైన పంచ్‌లు, కథ, కథనాలతో విసిగి వేసారిన ప్రేక్షకులపై ఒక్కసారిగా వచ్చి పడే పాటలు... ఇలా ఆద్యంతం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించేలా సినిమా ఉంది.

చివరగా...'ఉంగరాల రాంబాబు'... చూసే ప్రేక్షకుడికి గింగిరాలు తిరగడం ఖాయం

Show Full Article
Print Article
Next Story
More Stories