నిక్కీహేలీ రాజీనామా.. ట్రంప్ కూతురికి లైన్ క్లియర్

Submitted by nanireddy on Thu, 10/11/2018 - 11:05
un-ambassador-nikki-haley-resigns

ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా ఉన్న ఇండియన్ అమెరికన్ నిక్కీహేలీ తన పదవికి రాజీనామా చేశారు. 2016 లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమెను ఈ పదవిలో నియమించారు. తాజాగా ఆమె వ్యక్తిగత కారణాల రీత్యా ఈ పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఆమె రాజీనామా విషయాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నిక్కీ హేలీ ఈ పదవి చేపట్టకముందు సౌత్ కరోలినా గవర్నర్ గా పనిచేశారు. ఇక ఆమె స్థానంలో తన కూతురు ఇవాంక ట్రంప్ నియమించేందుకు గొప్ప అవకాశం ఉందని, బంధుప్రీతితో ఆ పదవి ఇచ్చారని ఫిర్యాదులు రాకపోతే, తన కుమార్తె ఆ పదవికి సరిపోతుందన్నారు. 

English Title
un-ambassador-nikki-haley-resigns

MORE FROM AUTHOR

RELATED ARTICLES