రాజ‌కీయాల్లోకి మ‌రోస్టార్ హీరో

రాజ‌కీయాల్లోకి మ‌రోస్టార్ హీరో
x
Highlights

దేశంలో వార‌స‌త్వ రాజ‌కీయాలు కొన‌సాగుతున్నాయి. తండ్రి రాజ‌కీయాల్లో క్రీయాశీల‌క పాత్ర‌పోషిస్తే ..కొడుకు కూడా తండ్రి వార‌స‌త్వంగా వ‌స్తున్న రాజ‌కీయాన్నే...

దేశంలో వార‌స‌త్వ రాజ‌కీయాలు కొన‌సాగుతున్నాయి. తండ్రి రాజ‌కీయాల్లో క్రీయాశీల‌క పాత్ర‌పోషిస్తే ..కొడుకు కూడా తండ్రి వార‌స‌త్వంగా వ‌స్తున్న రాజ‌కీయాన్నే శాసించాలి. ప్ర‌స్తుతం మ‌న‌దేశం లో జ‌రుగుతున్న రాజ‌కీయా తంతు ఇదే. ఇదిలా ఉంచితే తమిళరాజకీయాల్లో కురువృద్దుడు డీఎంకే అధినేత కరుణానిధి చెరగని ముద్ర వేశారు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 60 ఏళ్లుగా రాజకీయ జీవితంలో ప్రయాణించారు కరుణానిధి. అలాంటి కరుడుగట్టిన రాజకీయ నేత అయిన కరుణానిధి ప్ర‌స్తుతం వార‌స‌త్వ రాజ‌కీయాల్నీ ప్రోత్స‌హించే ప‌నిలో బిజీగా ఉన్నారు.
తమిళ సినిమా రంగంలో మంచి పేరు తెచ్చుకుంటున్న యువ హీరో ఉదయా నిధి స్టాలిన్ త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లో కి వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది. తన తండ్రి స్టాలిన్ కు అండగా తన తాత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి స్థాపించిన డీఎంకే పార్టీలో రంగ ప్రవేశం చెయ్యాలని ఉదయానిధి స్టాలిన్ నిర్ణయించుకున్నారు.
చిత్ర పరిశ్రలో ఉంటూ డీఎంకేకి ప్రచారం చేస్తే తనకు ఆ పార్టీ వాదిగా గుర్తింపు పడి సినీ జీవితంపై ప్రభావం చూపిస్తుందని భావించిన ఉదయా నిధి స్టాలిన్ ఇంత కాలం హీరోగా, నిర్మాతగా బాధ్యతలు నిర్వహించారు. అయితే శాసన సభ ఎన్నికల ప్రచారం సందర్బంగా స్టాలిన్ తంజావూరు వెళ్లిన సమయంలో ఆయన వెంట ఉదయానిధి ప్రచారానికి వెళ్లారు. 2016 ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత స్టాలిన్ ఎన్నికల అధికారుల దగ్గర ధ్రువీకరణ పత్రాన్ని అందుకోవడానికి వెళ్లినప్పుడు ఆయన వెంటే వెళ్లారు. తన కుమారుడు, కుమార్తె రాజకీయాల్లోకి రారని, తన రాజకీయ వారసులు ఎవరూ లేరని గతంలో స్టాలిన్ పదే పదే చెప్పారు. అయితే తాజా పరిణాలు పరిశీలిస్తే ఉదయానిధి స్టాలిన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని స్పష్టంగా కనపడుతుందని డీఎంకే వర్గాలు అంటున్నాయి. తన సీని గ్లామర్ తో పార్టీని ముందుకు తీసుకు వెళ్లే సత్తా ఉదయానిధి స్టాలిన్ కు ఉందని ఆ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories