వినోదం యు టర్న్ తీసుకుందా?

వినోదం యు టర్న్ తీసుకుందా?
x
Highlights

స‌మంత అభిన‌యం సక్సెస్, క‌థ లో విషయం మేస్సేజ్స్ , వినోధం పాళ్ళు అన్ ఫోకస్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌ మాత్రం ప్లస్సు. శ్రీ.కో. కన్నడ యు-టర్న్ కి...

స‌మంత అభిన‌యం సక్సెస్,

క‌థ లో విషయం మేస్సేజ్స్ ,

వినోధం పాళ్ళు అన్ ఫోకస్స్,

బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌ మాత్రం ప్లస్సు. శ్రీ.కో.

కన్నడ యు-టర్న్ కి తెలుగు, తమిళంలో యు-టర్న్ సినిమాని రీమేక్ చేసిన సినిమా . అయితే పవన్ కుమార్ కన్నడలో సూపర్ హిట్ అయినా యు-టర్న్ ని తెలుగులో పేద్దగా మార్పులు చేర్పులు చేయక, ఒక చిన్న మార్పు చేసాడు. డివైడర్స్‌ను దాటుకుని వెళ్లొద్దు, హెల్మెట్‌ను ధరించండి, సిగ్నల్స్ జంప్ చేయొద్దు, తాగి వాహనాలు నడపొద్దు లాంటి ట్రాఫిక్ నిబంధనలు వాహనదారుల్లో నింపేందుకే ఈ సినిమా బాగా పనిచేస్తుంది. అయితే వాటిని తూచా తప్పకుండా పాటించేవాళ్లు చాలా తక్కువమందే. రాంగ్ రూట్‌‌లో యూ టర్న్ తీసుకుని ప్రయాణం చేయడం వల్ల ఏర్పడే ముప్పును సస్పెన్స్ థ్రిల్లర్‌గా మార్చాడు దర్శకుడు. అయితే కన్నడ వెర్షన్ చూడని ప్రేక్షకుడికి ఈ తెలుగు యు-టర్న్ ట్విస్టులతో ఆకట్టుకుంది. కానీ ఆ వెర్షన్ చూసిన ప్రేక్షకుడికి ఈ సినిమా చూస్తే బోర్ కొట్టేస్తుంది. సెకండ్ హాఫ్ లో భూమిక పాత్రను ప్రవేశపెట్టిన తరువాత ఈ సినిమా పూర్తిగా మారుతుంది. సమంత తన పాత్రలో జీవించారని చెప్పాలి. ఇక చిత్రానికి ప్రధాన బలం నేపథ్య సంగీతం, ఈ చిత్రంలో పాటలు లేకపోవడంతో తన ఫోకస్ మొత్తం బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌పైనే పెట్టినట్టుగా అనిపిస్తుంది. మొత్తానికి ఒక మంచి సుస్పెన్సు థ్రిల్లర్ మాత్రమే కాడుండా, ఒక మేస్సజుని కుడా అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories