గులాబీ పార్టీకి ఇద్దరు ఎంపీల గుడ్‌బై?

Submitted by chandram on Thu, 11/15/2018 - 13:04
trs

తెలంగాణలో ఇతర పార్టీల మాదిరీగానే మొన్నటివరకు అధికార పార్టీలోని నేతలు కూడా వలస బాటపడుతున్నారా? తెరాస పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరే యత్నం చేస్తున్నారా? వారు ఎవరో కాదు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్. వీరిద్ధరు గూలాబీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థంపుచ్చుకుంటున్నారా? అంటే ముమ్మటికి అవుననే సమాధానాలే వస్తున్నాయి. చేవెళ్ల చాలా కాలం నుండి టీఆర్ఎస్ పై అసంతృప్తితోనే ఉన్నారు. కాగా రంగారెడ్డి జిల్లా మంత్రి పట్నం మహేందర్ రెడ్డికే పార్టీలో అధిక గుర్తింపు ఇవ్వడంతో విశ్వేశ్వర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ హోరాహోరిగానే ఉన్నాయని అన్నిచోట్లా అధికార పార్టీకి ఎదురీత తప్పడంలేదని చేవెళ్ల స్పష్టంచేశారు.

ఇక మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ పార్టీకండువా మార్చేందుకు సిద్ధమవుతున్నాడా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సీతారాంకీ పోటీగా కేరళ ఐపిఎస్ అధికారి లక్ష్మణ్‌ నాయక్ ను టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని సీతారాం అసంతృప్తిలో ఉన్నారు. మళ్లీ సీతారాంకీ సీటు ఇచ్చేదే లేదని అధిష్ఠానం సంకేతాలు పంపీనట్లు విశ్వసనీయవర్గాలుచెప్పుకొస్తున్నాయి. కాంగ్రెస్‌ నుంచి గతంలో మహబూబాబాద్‌ ఎంపీగా పోటీచేసిన కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌ ఇసారి మహబూబాబాద్‌ అసెంబ్లీ నుంచి బరిలో దిగుతున్నారు. కాగా  మహబూబాబాద్‌ లోక్‌సభకు పోటీచేసే అవకాశం కాంగ్రెస్ కల్పిస్తాన్న భరోసాతో సీతారాం నాయక్‌ కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఇద్దరు ఎంపీలు అధికార పార్టీని వీడటం టీఆర్ఎస్ పై తీవ్ర ప్రభావం పడుతుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

English Title
two trs mp candidates are joining to congress party ?

MORE FROM AUTHOR

RELATED ARTICLES