ఇలాంటి మోసగాళ్ల బుట్టలో పడకండి!

ఇలాంటి మోసగాళ్ల బుట్టలో పడకండి!
x
Highlights

పది వేలు పెట్టుబడి పెట్టండి. రోజుకు 300 రూపాయల చొప్పున 100 రోజుల పాటు ఇస్తాం. మీ తరఫున ఇంకొందరిని చేర్చండి. అదనంగా రోజు యాభై రూపాయలు ఇస్తాం....

పది వేలు పెట్టుబడి పెట్టండి. రోజుకు 300 రూపాయల చొప్పున 100 రోజుల పాటు ఇస్తాం. మీ తరఫున ఇంకొందరిని చేర్చండి. అదనంగా రోజు యాభై రూపాయలు ఇస్తాం. ఇంకొందరిని చేర్చండి. మరికొంత పెంచి ఇస్తాం. పదివేల కంటే ఎక్కువ పెట్టుబడి పెడితే.. అంతకు తగినంత పెద్ద మొత్తాన్ని రోజూ అందిస్తాం. రండి బాబూ రండి.. ఆలసించిన ఆశా భంగం.. మంచి తరుణం మించిన దొరకదు. అంటూ.. ఇద్దరు కేటుగాళ్లు.. హైదరాబాదీలను మోసించబోయి రెడ్ హాండెడ్ గా దొరికిపోయారు.అందులో.. మాజీ పోలీసు కూడా ఉండడం మన దౌర్భాగ్యం.

అసలు విషయం ఏంటంటే.. మల్టిపుల్ బెనిఫిట్ స్కీమ్ అంటూ.. ఇద్దరు వ్యక్తులు జనాన్ని మోసం చేయడం అలవాటు చేసుకున్నారు. అందులో.. ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా పనిచేసి.. అధికారులు గెంటేస్తే బయటికి వచ్చిన శ్యాంసుందర్ అనే వ్యక్తి.. సినిమా ఇండస్ట్రీలో పని చేసే వాసుదేవ నాయుడు ఉన్నారు. ఈ ఇద్దరూ కలిసి.. ఇన్వెస్ట్ మెంట్ బెనిఫిట్ స్కీమ్ అంటూ జనాన్ని మోసం చేస్తూ.. ఈ క్యాష్ ట్రేడ్ సెక్యురిటీస్ పేరుతో సంస్థను కూడా నిర్వహించారు.

ఇలా.. జనాన్ని మోసం చేసి.. తక్కువ సమయంలోనే 50 కోట్ల నగదు సంపాదించి.. బోర్డు ఎత్తేయాలని పన్నాగం పన్నారు. 4 కోట్లకు పైగా డబ్బులు కూడా వసూలు చేసి.. తిరిగి జనాన్ని నమ్మించేందుకు కోటి 73 లక్షల రూపాయల మొత్తం కూడా చెల్లించి నాటకాలు ఆడారు. దాదాపు 400 మంది సభ్యులను కూడా చేర్చుకున్నారు. ఈ క్రమంలోనే.. పోలీసులకు పట్టుబడి.. ఇప్పుడు ఇద్దరూ ఊచలు లెక్కబెడున్నారు.

ఇలా.. బ్యాంకు డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీ ఇస్తామని ఎవరు చెప్పినా నమ్మొద్దని పోలీసులు కోరుతున్నారు. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories