మిత్రబంధం తెగినా కొనసాగుతోన్న రక్తబంధం

x
Highlights

ప్లేస్ ఒక్కటే.. కానీ పార్టీలే వేరు. రక్తం పంచుకున్న అన్నదమ్ములే.. కానీ రాజకీయంగా బద్ద శత్రువులు. ఉమ్మడి ఆస్తే.. అందుకే ఇరువురూ పంచుకుంటున్నారు.. ఒకే...

ప్లేస్ ఒక్కటే.. కానీ పార్టీలే వేరు. రక్తం పంచుకున్న అన్నదమ్ములే.. కానీ రాజకీయంగా బద్ద శత్రువులు. ఉమ్మడి ఆస్తే.. అందుకే ఇరువురూ పంచుకుంటున్నారు.. ఒకే వేదికగా.. ఒకరిపై మరొకరు విమర్శలకు దిగుతున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం టీడీపీ కార్యాలయం.. ఇప్పుడు బీజేపీ సమావేశాలకు అడ్డగా మారిపోయింది. ఒకే కార్యాలయం వేదికగా.. రెండు పార్టీలు నిప్పులు చిమ్ముకుంటున్నాయి.

విజయనగరం జిల్లా పార్వతీపురంలో టీడీపీ కార్యాలయం. కానీ ఇక్కడ బీజేపీ సమావేశాలూ జరుగుతాయి. ఎప్పుడు ఏ పార్టీ మీటింగ్ పెడితే.. అప్పుడా కలర్‌లోకి మారిపోతుంది. ఆయా పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు జెండాలు ఎగురుతాయి. అందుకే ఈ కార్యాలయంలో పసుపు, కాషాయం జెండాలెప్పుడూ రెపరెపలాడుతాయి.

టీడీపీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్‌, రామ్మోహన్‌లు ఇద్దరూ అన్నదమ్ములు. ఒకప్పుడూ వీరిద్దరూ తెలుగుదేశానికి చెందిన నాయకులు. దీంతో సొంతింట్లోనే పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేశారు. అయితే రామ్మోహన్.. బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో.. సీన్ రక్తికట్టింది. ఇద్దరూ అన్నదమ్ములు కావడం.. ఆస్తులు ఒక్కచోటే ఉండటంతో.. వేర్వేరు పార్టీలకు చెందిన ఈ నాయకులు.. ఉన్న ఒకే కార్యాలయాన్ని ఉపయోగించుకోవడం ఆసక్తికరంగా మారింది.

ఒకవేళ ముందుగా టీడీపీ సమావేశం జరిగితే బద్దశత్రువైన బీజేపీపై ఇక్కడ విమర్శలు వినిపిస్తాయి. తర్వాత బీజేపీ నాయకులు ఇదే అడ్డగా.. టీడీపీ తీరును ఎండగడతారు. పంచ్ డైలాగులతో పచ్చపార్టీని ఉతికి ఆరేస్తారు. ఆ సమయంలో ఆయా పార్టీలకు చెందిన జెండాలు, ఫ్లెక్సీలు మాత్రం మారుతుంటాయి.

పార్టీల వారిగా వేర్వేరైనా.. అన్నదమ్ములుగా రక్తసంబంధం ఒక్కటే అని చాటుతున్నారీ సహోదరులు. నాలుగేళ్ల బంధాన్ని పార్టీలు అధికారికంగా తెగదెంపులు చేసుకున్నా.. వీరిద్దరు మాత్రం ఒకే కార్యాలయాన్ని పంచుకోవడమే.. చర్చనీయాంశంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories