బ్రేకింగ్ : కాంగ్రెస్ కు ఇద్దరు ఎమ్మెల్యేల టాటా?.. చక్రం తిప్పుతున్న గాలి!

Submitted by nanireddy on Thu, 05/17/2018 - 11:52
two congress mla's missing in congress resort

కర్ణాటకలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.. మెజారిటీ లేకున్నా నేడు(గురువారం) కర్ణాటక 23 వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు యడ్యూరప్ప.బలనిరూపణ కోసం పదిహేను రోజుల గడువు కోరారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేలను సమీకరించే పనిలోపడ్డారు బీజేపీ నేతలు. అందులో భాగంగా ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు వల విసిరింది. వారు కూడా ఎప్పుడెప్పుడు బీజేపీలో చేరాలని ఉవ్విళూరుతుననట్టు సమాచారం. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలు ఈగిల్టన్ గోల్ఫ్ రిసార్ట్ నుంచి కనిపించకుండా పోయారు. ఎలాగైనా ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకుని మెజారిటీ నిరూపించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుండటం, ఈ తరుణంలోనే  ఇద్దరూ మిస్ అవ్వడం పలు సందేహాలకు తావిస్తోంది. అయితే దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే  ఖాదర్ స్పందిస్తూ.. 'ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు రిసార్టులో లేరు. నిన్నటినుంచి కనిపించకుండా పోయారు' అని సమాధానమిచ్చాడు.. అయితే కాంగ్రెస్ మాత్రం ఇద్దరు ఎమ్మెల్యేలపై అనుమానపడుతోంది వీరు కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధనరెడ్డి శిభిరంలో చేరి ఉంటారని వారి వెనుక గాలి జనార్దన్ రెడ్డి, అయన తమ్ముళ్లు కరుణాకర రెడ్డి, సోమశేఖర రెడ్డి లు ఉన్నట్టు దాదాపు అంచనాకు వచ్చింది. ఈ క్రమంలో మిగతా ఎమ్మెల్యేలు చేజారకుండా కాంగ్రెస్, జేడీఎస్‌లు జాగ్రత్త పడుతున్నాయి. బీజేపీ నేతలకు చిక్కకుండా ఇరువురు రిసార్ట్ రాజకీయం మొదలుపెట్టారు.

English Title
two congress mla's missing in congress resort

MORE FROM AUTHOR

RELATED ARTICLES