అజ్ఞాతంలో యాంకర్ ప్రదీప్

Submitted by arun on Thu, 01/04/2018 - 11:54
Pradeep Machiraju

స్మాల్‌స్క్రీన్‌పై కొంచెం టచ్‌లో ఉంటా అంటూ సందడి చేసిన యాంకర్‌ ప్రదీప్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడా? అసలు ప్రదీప్ ఏమయ్యాడు? ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడీ ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి. న్యూ ఇయర్‌ రోజు డ్రంకెన్‌ డ్రైవ్‌లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ప్రదీప్‌ ఎవరికి టచ్‌లో లేకుండా పోయాడు. మోతాదుకు మించి మద్యం సేవించి కారు డ్రైవ్‌ చేసిన ప్రదీప్‌ను కౌన్సిలింగ్ కు రావాలని నోటీసులు  పంపినా హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడినప్పటి నుంచి వారం రోజుల్లోపు కౌన్సిలింగ్‌‌కు రావాల్సి ఉంటుంది. కానీ మూడ్రోజులైన ప్రదీప్‌ హాజరుకాలేదు. ఇంటికి, ఆఫీస్‌కు తాళాలు వేయడంతో పాటు ప్రదీప్‌ ఫోన్‌ స్విచ్చాఫ్ కావడంతో  పరారీలో ఉన్నట్లు  అనుమానాలు కలుగుతున్నాయి.  మరోవైపు ప్రదీప్ కౌన్సెలింగ్‌ కు హాజరు కాకుంటే ఛార్జీషీట్ దాఖలు చేసి వారెంట్ జారీ చేసి, కౌన్సెలింగ్ ఇచ్చాకే కోర్టులో ప్రవేశ పెడతామని పోలీసులు చెబుతున్నారు. ప్రదీప్ చర్యను బట్టి తమ తదుపరి చర్యలు ఉంటాయన్నారు.  మరి ప్రదీప్ కౌన్సిలింగ్‌కు వస్తాడా రాడా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. 

English Title
TV anchor Pradeep skips counselling session

MORE FROM AUTHOR

RELATED ARTICLES