తుల్జా భవాని ఆలయం గురించి సవివరంగా..

తుల్జా భవాని ఆలయం గురించి సవివరంగా..
x
Highlights

తుల్జా మాత దేవాలయ నిర్మాణ శైలి... హేమద్పంతి పద్ధతిలో గోచరిస్తుంది. అమ్మవారి దేవాలయాన్ని సమీపించిన మనకు అక్కడ రెండు పెద్ద మహద్వారాలు దర్శనమిస్తాయి....

తుల్జా మాత దేవాలయ నిర్మాణ శైలి... హేమద్పంతి పద్ధతిలో గోచరిస్తుంది. అమ్మవారి దేవాలయాన్ని సమీపించిన మనకు అక్కడ రెండు పెద్ద మహద్వారాలు దర్శనమిస్తాయి. గుడిలో ప్రవేశించగానే మొదటగా 108 పవిత్ర తీర్థాలతో కూడిన కల్లోల తీర్థం కనబడుతుంది. నిత్యం ఈ తీర్థం ప్రవహిస్తుండటం ఇక్కడి విశేషం. గోముఖ్‌ సమీపంలో సిద్ది వినాయకుని ఆలయం దర్శనమిస్తుంది. ఆ తర్వాత సర్దార్‌ నింబాల్కర్‌ నిర్మించిన చక్కటి ఆకృతులతో తీర్చిదిద్దిన ఓ గేటును దాటుకుంటూ వస్తాం. ఈ గేటులోనికి ప్రవేశించిన మనకు రెండు ఆకృతులు కనబడతాయి. ఎడమౖవెపున మార్కేండేయ మహర్షి విగ్రహం ఉంటే కుడిౖవెపున పెద్ద నగారా గోచరిస్తుంది. గర్భగుడిలోకి ప్రవేశించిన మనకు స్వర్ణాభరణాలతో ధగధగలాడుతూ స్వయంభుగా వెలసిన తుల్జా మాత దర్శనమిస్తుంది. అమ్మవారి దర్శనం మదిని పులకింపజేస్తుంది.

గర్భగుడికి సమీపంలో పాలంగ్గా పిలువబడే వెండితో తయారుకాబడ్డ మంచం ఒకటి కనిపిస్తుంది. అమ్మవారు ఈ మంచౖంపె నిద్రకు ఉపక్రమిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక పాలంగ్కు ఎదురుగా మహదేవ లింగం కనబడుతుంది. చూసేందుకు భవానీ.. ఆ సర్వేశ్వరుడు ఒకరికొకరు ఎదురెదురుగా ఆశీనులైనట్లు మనకు తెలుస్తుంది. అక్కడ ఉన్న స్థూపాలలోని ఒకదానిౖపె ఓ వెండి ఉంగరం ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఈ స్థూపం గురించి ఓ విశ్వాసం వుంది. అదేమంటే... శరీరంలోని ఏ భాగంలోౖనెనా తీవ్రౖమెన నొప్పితో బాధపడేవారు ఆ ఉంగరాన్ని ఏడురోజులపాటు తాకితే చాలు ఉపశమనం కలిగి నొప్పి మాయమవుతుంది.

తుల్జా భవానీ దీవెనలౖకె ఛత్రపతి శివాజీ తరచుగా ఆలయాన్ని దర్శించేవారని ప్రతీతి. ఆలయంలో శకునవంతి అన్న పేరుతో పిలిచే ఓ గుండ్రని రాయి ఉంది. ఇది ఓ అద్భుతౖమెన రాయి అని ప్రజలు నమ్ముతారు.ఈ రాయిౖపె చేతితో గట్టిగా అదిమిపెట్టి ఓ ప్రశ్నను అడిగి దానికి అవునా కాదా అని అడిగితే రాయి స్పందిస్తుంది. సమాధానం అవును అయితే రాయి కుడిౖవెపుకు తిరుగుతుంది. కాదు అనే సమాధానౖమెనట్లయితే ఎడమౖవెపుకు తిరుగుతుంది. ఒకవేళ రాయి ఎటూ కదలకుండా స్థిరంగా ఉన్నట్లయితే అనుకున్న పని కాస్తంత ఆలస్యంగా పూర్తవుతుందని అర్థం. ఇవన్నీ భక్తులు నమ్మకాలు. అంతేకాదు ఛత్రపతి శివాజీ సైతం ఏ యుద్ధానిౖకెనా వెళ్లే ముందు చింతామణి వద్దకు వెళ్లి తాను సమరానికి వెళ్లాలా.. వద్దా అని ప్రశ్నించేవాడట. చింతామణి తర్వాత మనకు దర్శనమిచ్చేది జమదర్ఖానా (ఖజానా). అమ్మవారు నగలన్నీ ఈ జమదర్ఖానాలో భద్రపరచబ డతాయి. ఈ నగలన్నీ ఉత్సవాల సమయంలో అమ్మవారికి ధరింపచేస్తారు. ఈ నగలలో 108 విగ్రహాలు పొదిగిన బంగారు గొలుసు నాటి రారాజు ఛత్రపతి శివాజీ అమ్మవారికి బహూకరించినది కావటం విశేషం.

ఆలయంలో తుల్జా భవానీ పూజ
మరాఠా ప్రాంతంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆలయంగా తుల్జా మాత దేవాలయం నిలిచింది. నాటి భోంస్లే పాలకులకు తుల్జా మాత కుటుంబ దేవత. అమ్మవారి దీవెనలతో ఛత్రపతి శివాజీ యుద్ధభూమిలో ప్రతిసారి విజయం సాధించేవారు. అంతేకాదు తుల్జా భవానీ ఛత్రపతి శివాజీకి ఖడ్గాన్ని బహూకరించిందని విశ్వాసం. తుల్జా భవాని మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌ జిల్లాలో కొలువై ఉంది. తుల్జా మాత ఛత్రపతి శివాజీకే కాదు అనేక కుటుంబాలకు... ఇంకా చెప్పాలంటే ఇతర రాష్ట్రాలలోని ప్రజలకు కుటుంబ దేవత. మహారాష్ట్రలోని మూడున్నర శక్తి పీఠాలు మరియు భారతదేశంలోని 50 శక్తిపీఠాలలో ఒకటి తుల్జా భవానీ ఆలయం.

ఎక్కడ బస చేయాలి
ఆలయ ధార్మిక మండలి భక్తులకు వసతి సౌకర్యాలను కల్పిస్తుంది. భక్తులకు ఉచిత బస సౌకర్యాన్ని అందించేందుకుగాను ట్రస్ట్‌ నూతనంగా ధర్మశాలను ప్రారంభించింది. ఇవిగాక తుల్జాపూర్‌ పట్టణంలో ప్రైవేటు వ్యక్తులు నిర్వహించే లాడ్జిలు ఉన్నాయి.

తుల్జాపూర్‌ సముద్ర మట్టానికి 270 మీటర్ల ఎత్తులో బాలాఘట్‌ అని పిలువబడే కొండలౖపె నెలకొని ఉంది. చింతచెట్లతో నిండి ఉండే ఈ పట్టణానికి చించపూర్‌ అన్నపేరు ఉండేది. క్రమంగా ఈ పేరు తుల్జా భవానీ పేరుమీద తుల్జాపూర్‌గా మారింది. భారతదేశంలోని పుణ్య క్షేత్రాలలో తుల్జాపూర్‌ ఒకటని చెప్పవచ్చు. ఆలయాన్ని ఏటా లక్షలమంది భక్తులు దర్శించుకుని అమ్మవారి దీవెనలు అందుకుని వెళుతుంటారు. నవరాత్రి పండుగనాడు ఆలయం మరింత రద్దీగా ఉంటుంది.

భారతదేశంలో పూర్వం నైమిష్య అరణ్యం, దండకారణ్యం అని రెండు అడవులుండేవి. మహారాష్ట్రలో భాగౖమెన మరతవాడ అనే ప్రదేశం దండకారణ్యంలో ఉండేది. దీనిని యమునాచల పర్వతాలు లేదా బాలాఘాట్‌గా పిలిచేవారు. యమునాచల పర్వత ప్రాంతంలోని అడవులలో తుల్జాపూర్‌ ఉన్నది. ఈ ప్రాంతంలో సాలిగ్రాంతో తయారుకాబడి స్వయంభుగా వెలిసిన విగ్రహం ఉన్నది.

ఇక భవాని విగ్రహ ప్రతిష్టాపనను ఇతర దేవాలయాలతో పోల్చి చూసినప్పుడు ఒకింత తేడాను మనం గమనించవచ్చు. విగ్రహం స్థిరంగా ప్రతిష్టింపబడలేదు. సహజంగా చాలా దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్టాపన స్థిరంగా ఉంటుంది. అయితే ఈ ఆలయంలో మాత్రం విగ్రహం చలన స్థితిలో ప్రతిష్టించబడి ఉంది. అంటే విగ్రహం కదులుతుందన్నమాట. ఈ విగ్రహ ప్రతిష్టాపనను శ్రీయాత్రలో ఆదిశంకరాచార్యుల వారు చేసినట్లు చరిత్ర చెబుతోంది. విగ్రహం చలన స్థితిలో ఉండటంతో ప్రతి ఏటా మూడుసార్లు శ్రీయాత్రకు మాత తరలివస్తుంది.

తుల్జా భవానీ అమ్మవారి దివ్యరూపం
స్వయంభుగా వెలిసిన తుల్జా భవానీ విగ్రహం నల్లరాతితో మలచబడింది. విగ్రహం మలచబడ్డ తీరును మనం గమనించినట్లయితే... దేవిపంచాయతనా పద్ధతని స్పష్టంగా తెలుస్తుంది. విగ్రహానికి ఎనిమిది చేతులున్నాయి. ఒక చేయి దైత్య జుట్టును పట్టుకుని ఉంటుంది. మరో చేతిలోని త్రిశూలంతో దైత్యుని గుండెను చీల్చుతున్నట్లు ఉంటుంది. పాదాలవద్ద మహిషాసురుని ఆకారం కనబడుతుంది.ఇక దేవి కుడిచేతి వైపు ఆమె వాహనౖమెన సింహం విగ్రహం కనబడుతుంది. విగ్రహానికి సమీపంలో మార్కేండయ ఋషి ఆకృతి నెలకొని ఉండటాన్ని గమనించవచ్చు. విగ్రహానికి సమీపంలో చంద్రబింబం కనబడుతుంది. అలాగే కుడిౖవెపున సూర్య భగవానుని బింబం గోచరిస్తుంది. విగ్రహానికి ఉన్న ప్రతి చేతిలోనూ చక్రం, గద, త్రిశూలం, అంకుశం, ధనుస్సు వంటి ఆయుధాలు ఉండటాన్ని మనం గమనించవచ్చు. అమ్మవారి విగ్రహానికి కుడివైపున అనుభూతి అని పిలువబడే మహిళ ప్రార్థిస్తున్నట్లు కనబడుతుంది.

తుల్జా భవానీ చరిత్ర
పురాణాలలో దేవి చరిత్ర ప్రస్తుతించడింది. తుల్జా భవానీకి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం మార్కేండేయ పురాణంలో చూడవచ్చు. సంస్కృతంలోని దుర్గ సప్తాశతిలో అమ్మవారికి చెందిన పురాణగాథ 13 అధ్యాయాలలోను, 7 వందల శ్లోకాలు లేదా పద్యాలతో వివరించబడింది. దేవీ భాగవతంలోనూ అమ్మవారి వృత్తాంతం చెప్పబడింది.

తుల్జా భవానీ కథ
కృతయుగంలో కర్డమ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య అనుభూతి. ఆమె రతీదేవి అంతటి అందగత్తె. కర్డమ మరణించటంతో అతని చితిౖపె కూర్చుని సతీసహగమానికి సిద్ధపడుతుంది. ఆ సమయంలో ఆకాశవాణి నుంచి.. ఏ మహిళైనా పిల్లలను విడిచి వెళ్లరాదు అన్న మాటలు వినిపించాయి. ఈ మాటలు విన్న అనంతరం ఆమె తన మనస్సు మార్చుకుని మందాకిని నదీసమీపంలో తపస్సుకు పూనుకుంటుంది. అలా అనుభూతి యోగ సమాధిలో ఉంటుంది. డెమన్‌ రాజు కుకార్‌ సమాధి స్థితిలో ఉన్న అనుభూతిని చూస్తాడు. అంతేకాదు ఆమె అందం అతణ్ణి వివశుడ్ని చేస్తుంది. ఆమెను ఎలాౖగెనా పొందాలనే ఆకాంక్షతో తొలి ప్రయత్నంగా ఆమెను తీయటి మాటలతో లొంగ దీసుకోవాలనుకుంటాడు. అది విఫలం కావటంతో బలవంతం చేయబోతాడు. ఈ పరిణామంతో అనుభూతి అమ్మవారిని వేడుకుంటుంది. ఆమె ఆక్రందనలను విన్న మాతా తుల్జా ప్రత్యక్షమవుతుంది. కుకార్‌ తన రూపును పశువుగా మార్చుకుని యుద్ధ భూమిలో వికృతంగా నాట్యం చేస్తుంటాడు. అశ్విని సుధా10 నాడు తుల్జా మాత కుకార్ను వధిస్తుంది. అందువల్లనే ఆ రోజు విజయ దశమి ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఆపదలో ఉన్న భక్తుల పిలుపును ఆలకించి వెనువెంటనే ప్రత్యక్షమయ్యే మాత కనుక ఆమెకు 'త్వరిత' అన్న నామం సార్థకౖమెంది. మరాఠీలో 'తుల్జా' అంటే త్వరితంగా ప్రత్యక్షమయ్యే దేవత అని అర్థం.

ఈ ప్రాంతానికి ఎలా చేరుకోవాలి
ఈ ప్రాంతానికి చేరుకునేందుకు పలు మార్గాలు వున్నప్పటికీ.. ప్రధానంగా బస్సు, రైలు, విమాన మార్గాలను ఆశ్రయించాల్సి వుంటుంది.

బస్సు మార్గంలో...
దక్షిణభారతం నుంచి వచ్చే భక్తులు తుల్జాపూర్‌కు 35 కిలోమీటర్ల దూరంలో వున్న నల్దుర్గు కు రావాల్సి వుంటుంది. ఈ మార్గం రెండుగా చీలుతుంది. ఒకటి షోలాపూర్‌, మరొకటి తుల్జాపూర్‌కు చేరుకుటుంది. అలాగే.. ఉత్తర, పశ్చిమ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు షోలాపూర్‌కు చేరుకోవాలి. అక్కడ నుంచి 44 కిమీ దూరంలో తుల్జాపూర్‌లో వుంటుంది. తుల్జాపూర్‌కు 18 కిమీ దూరంలో వున్న ఒస్మాన్బాద్కు చేరుకుని అక్కడ నుంచి తుల్జాపూర్కు చేరుకోవచ్చు. ఇకపోతే తూర్పు ప్రాంతం నుంచి వచ్చే భక్తులు నాగ్పూర్కు చేరుకుని అక్కడ నుంచి 560 కిమీ దూరంలో వున్న తుల్జాపూర్కు చేరుకోవచ్చు. లేదా లాతూర్కు చేరుకోవచ్చు. ఇక్కడ నుంచి 75 కిమీ దూరంలో తుల్జాపూర్‌ వుంది. షోలావూర్‌, ఒస్మాన్బాద్‌, నల్దుర్గా నుంచి తుల్జాపూర్‌కు ప్రతి పది నిమిషాలకొక బస్సు సర్వీసు వుంది.

రైలు మార్గం ద్వారా...
తుల్జాపూర్‌ను సందర్శించాలనే భక్తులు రైలు మార్గం ద్వా రా వస్తే షోలాపూర్‌కు చేరుకోవాలి. తుల్జాపూర్‌కు అతి దగ్గరలో వున్న రైల్వే స్టేషన్‌ ఇదే. ఈ రెండు ప్రాంతాల మధ్య 44 కిమీ దూరం వుంటుంది.

విమానమార్గం ద్వారా..
విమానమార్గంలో వచ్చే భక్తులు ముఖ్యంగా పూణెకు చేరుకోవాలి. ఈ విమానాశ్రయం మాత్రమే తుల్జాపూర్‌కు సమీపంలో వుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories