మోత్కుపల్లి కామెంట్స్ పై స్పందించిన రమణ

Submitted by arun on Thu, 01/18/2018 - 13:32
ramana

తెలంగాణ టీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలన్న మోత్కుపల్లి వ్యాఖ్యలను టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ ఖండించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎల్లకాలం ఉంటుందన్న ఎల్‌.రమణ విలీనం వ్యాఖ్యలు మోత్కుపల్లి వ్యక్తిగతమంటూ కొట్టేశారు. దీనిపై పొలిట్ బ్యూరోలో చర్చిస్తామని ఆయన అన్నారు. టీడీపీలో అందరకీ మాట్లాడే స్వేచ్ఛ ఉందన్నారు. తెలంగాణాలో టీడీపీ ఉంటుంది అని చంద్రబాబు చాలాసార్లు స్పష్టం చేశారని రమణ గుర్తుచేశారు. రాబోయే ఎలక్షన్స్‌లో అన్ని అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలలో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ భవన్‌లో ఇప్పటికే ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఇవాళ ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ఘాట్‌లో నివాళులర్పించిన మోత్కుపల్లి తెలంగాణలో తెలుగుదేశం పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ టీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తే బాగుంటుందన్నారు. రెండు రాష్ట్రాల్లోని తెలుగుదేశం అభిమానులకు ఇదే మంచిదన్నారు. తెలంగాణలో టీడీపీ ఇబ్బందుల్లో ఉందన్న మోత్కుపల్లి భుజాన వేసుకుని నడిపేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని మోత్కుపల్లి అన్నారు. టీఆర్ఎస్ కూడా మన పార్టీనే, కేసీఆర్ మన దగ్గరి నుంచి వెళ్లిన వ్యక్తే అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ పార్టీకి  సమయం కేటాయించలేరని అన్నారు. గౌరవంగా ఉండాలంటే తెలంగాణలో తెలుగుదేశం ఓటు బ్యాంకు కోసం, పార్టీ కార్యకర్తల కోసం టీఆర్‌ఎస్‌లో విలీనమే మంచిదని తెలిపారు.

English Title
ttdp president l ramana respond over motkupalli comments

MORE FROM AUTHOR

RELATED ARTICLES