తిరుమలలో హోటళ్లపై అధికారుల కొరడా..ఐదు హోటళ్లు సీజ్‌

Submitted by admin on Wed, 12/13/2017 - 15:50

తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న హోటళ్లపై టీటీడీ అధికారులు కొరడా ఝుళిపించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 5 హోటళ్లను అధికారులు సీజ్‌ చేశారు. మరికొన్ని హోటళ్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. తిరుమలలో హోటళ్లపై ఉమ్మడి హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ కొనసాగుతోంది. దీంతో ఆహార పదార్థాలు అధిక ధరలకు విక్రయిస్తున్న హోటళ్లపై భారీగా అపరాధ రుసుము విధించింది. నెల అద్దెతో పాటు అపరాధ రుసుము వెంటనే చెల్లించాలని నోటీసులు జారీచేసింది. రుసుము చెల్లించకపోవడంతో 15 హోటళ్లను మూసివేసింది. ఈ పరిణామంతో హోటళ్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

English Title
ttd-ride-hotels

MORE FROM AUTHOR

RELATED ARTICLES