అప్పుడే వివాదం.. అంతలోనే శాంతం... టీటీడీలో ఏం జరుగుతోంది?

అప్పుడే వివాదం.. అంతలోనే శాంతం... టీటీడీలో ఏం జరుగుతోంది?
x
Highlights

టీటీడీ బోర్డులో మరో వివాదం రాజుకున్నట్లే రాజుకుని...అంతలోనే సద్ధుమణిగింది. శ్రీకాకుళం జిల్లాలో క్రిష్టియన్ సభల్లో జీఎస్ఎస్‌ శివాజీ ఫోటో ఉండటంతో వివాదం...

టీటీడీ బోర్డులో మరో వివాదం రాజుకున్నట్లే రాజుకుని...అంతలోనే సద్ధుమణిగింది. శ్రీకాకుళం జిల్లాలో క్రిష్టియన్ సభల్లో జీఎస్ఎస్‌ శివాజీ ఫోటో ఉండటంతో వివాదం రేగింది. టీటీడీ బోర్డ్ మెంబర్‌ ఉండి...క్రిష్టియన్ సభలకు ఎలా వెళ్తారంటూ హిందూ ధర్మ పరిరక్షణ సంఘాలు, స్వామిజీలు ఆగ్రహం వ్యక్తం చేశాయ్. తిరుమల తిరుపతి దేవస్థానం విధివిధానాలకు అనుగుణంగా నడుచుకుంటామని గౌతు శ్యాం సుందర్ శివాజీ కూతురు గౌతు శిరీష స్పష్టం చేశారు.

శ్రీకాకుళం జిల్లా పలాసలో క్రిష్టియన్లు...ఈ నెల 22న సభలు నిర్వహిస్తున్నారు. సభలకు ముఖ్య అతిథిగా గౌతు శ్యాం సుందర్‌ శివాజీ వస్తున్నట్లు పోస్టర్లు వేశారు. పోస్టర్లు కాస్తా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయ్. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్‌గా ఉన్న గౌతు శ్యాం సుందర్‌ శివాజీ...క్రిష్టియన్ సభలకు ఎలా వెళ్తారంటూ హిందూ పరిరక్షణ సమితి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో...ప్రభుత్వం కావాలనే వివాదాలు సృష్టిస్తోందన్నారు శివస్వామి. హిందూవుల మనోభావాలను దెబ్బ తీసేందుకు ప్రభుత్వం పూనుకుందన్నారు. ప్రభుత్వ వైఖరి హిందూ ధర్మ సంస్థలన్ని ఖండిస్తున్నాయని శివస్వామి స్పష్టం చేశారు.

టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా బీసీలను నియమించినప్పటికీ అగ్రకులాలు జీర్ణించుకోలేకపోతున్నాయని బీసీ సంఘాల నేత అక్కినపల్లి లక్ష్మయ్య విమర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్‌, వీహెచ్‌పీలకు చెందిన వాళ్లే కుట్ర పన్ని పోస్టర్లు వేశారని లక్ష్మయ్య ఆరోపించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం విధివిధానాలు తుచ తప్పకుండా పాటిస్తామన్నారు గౌతు శ్యామ్‌ సుందర్ శివాజీ కూతురు గౌతు శిరీష. హిందూ మతంపై ఎంత గౌరవముందో....మిగతా మతాలపైనే గౌరముందన్నారు. ఓ ప్రజాప్రతినిధి గౌరవించి నాన్న పేరు వేసుకున్నారన్న ఆమె...క్రిష్టియన్ సభలకు నాన్న వెళ్లడం లేదని స్పష్టం చేశారు. గౌతు శ్యాం సుందర్‌ శివాజీ...క్రిష్టియన్‌ సభలకు వెళ్లరని గౌతు శిరీష ప్రకటించడంతో వివాదం సద్దుమణిగినట్లయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories