టైమ్ అండ్ డేట్ ఫిక్స్ , ట్రంప్, కిమ్ మీటింగ్‌

Submitted by santosh on Fri, 05/11/2018 - 14:38
trump and kim meeting

ముహూర్తం కుదిరింది.. కలుసుకునేందుకు ప్లేస్ ఫిక్స్ అయ్యింది.. ఇక మిగిలింది చర్చలే. యావత్ ప్రపంచాన్ని ఉత్కంఠకు.. అంతకుమించి ఆసక్తిని రేకెత్తించిన అమెరికా, ఉత్తర కొరియా అధ్యక్షులు ట్రంప్, కిమ్ భేటీకి అంతా ఓకే అయ్యింది. వచ్చే నెల 12న సింగపూర్‌లో ఇద్దరు యోధుల చరిత్రాత్మక సమావేశానికి సర్వం సిద్ధమైంది. 

ఎత్తుకు పై ఎత్తులు.. మాటలకు మించిన డైలాగులు.. అణ్వాయుధాల విషయంలో ఆంక్షలు ఎదుర్కొన్నా వెనకడుగు వేయని వైనం.. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా అనే లెవెల్లో వాతావరణం.. అన్నీ హాంఫట్ అయిపోయాయి. ప్రస్తుతం ఆ రెండు దేశాలూ.. శాంతిమంత్రం జపిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, ఉత్తరకొరియా మధ్య ఉప్పూ నిప్పులా ఉన్న పరిస్థితులు.. ఒక్కసారిగా చల్లబడ్డాయి. కూర్చొని చర్చలు జరుపుకోవాలని.. ట్రంప్, కిమ్ ల మధ్య ఒప్పందం కుదిరింది. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఉత్తర కొరియా టూర్‌ను ముగించుకుని వచ్చిన కొన్ని గంటల్లోనే.. టైమ్ అండ్ డేట్‌ను ఫిక్స్ చేశారు.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. 

వచ్చే నెల 12న సింగపూర్‌లో ఈ చరిత్రాత్మక భేటీ జరగనుంది. అయితే ఎజెండాపై ఉత్తరకొరియా మౌనంగా ఉన్నా.. అణ్వస్త్ర రహిత కొరియాపైనే చర్చ జరుగుతుందని అగ్రరాజ్యం భావిస్తోంది. అయితే తమపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని ఉత్తరకొరియా డిమాండ్‌ చేసే అవకాశముందని చెబుతున్నారు. ఇక ఈ సమావేశం తమతో సత్సంబంధాలున్న సింగపూర్‌లో జరిపేందుకు అమెరికా మొగ్గు చూపింది. ఇటు ఉత్తర కొరియాకు సింగపూర్‌తో గతంలో దౌత్య సంబంధాలున్నాయి. 

ఇదిలా ఉంటే.. ఉత్తర కొరియా నిర్బంధం నుంచి విముక్తి పొంది.. స్వదేశానికి చేరుకున్న ముగ్గురు అమెరికన్లకు ట్రంప్‌ సాదర స్వాగతం పలికారు. వారిని తీసుకొచ్చిన విమానం ల్యాండ్ కాగానే.. మెలానియాతో కలిసి ట్రంప్‌ విమానంలోకి ప్రవేశించారు. అత్యంత సంతోషంతో స్వదేశానికి స్వాగతించారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. కిమ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బందీలను విడుదల తనకు దక్కిన గౌరవం అన్న ట్రంప్.. కొరియా ద్వీపకల్పం అణ్వస్త్రరహితంగా మారినప్పుడే తనకు అసలైన గౌరవం లభించినట్లు భావిస్తానని చెప్పుకొచ్చారు. 
 

English Title
trump and kim meeting

MORE FROM AUTHOR

RELATED ARTICLES