అధికార పార్టీ ఎమ్మెల్యేలను వెంటాడుతున్న పంచాయతీ భయం

Submitted by arun on Wed, 01/17/2018 - 18:18
TRS government

అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొత్త పంచాయతీ చట్టం ఆందోళనకు గురిచేస్తోంది. పార్టీ గుర్తుల మీద ఎన్నికలు నిర్వహిస్తే టికెట్ల కోసం పోటీలు తీవ్రమవుతాయని టెన్షన్ పడుతున్నారు. టికెట్లు రాని వారు ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పనిచేస్తే తమకే నష్టమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

కొత్త పంచాయత్ రాజ్ ముసాయిదా చట్ట రూపం దాల్చక ముందే టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు తెగ టెన్షన్ పడుతున్నారు. ముసాయిదాలో విషయాలు బహిర్గతం కానప్పటికీ..పంచాయత్ ఎన్నికలను పార్టీ గుర్తుల మీద జరిపించాలని సీఎం కేసీఆర్ తలపొస్తున్నారు. పార్టీ బలాన్ని చాటేందుకే...గుర్తుల మీదే ఎన్నికలను నిర్వహించాలన్న పట్టుదల మీద ఉన్నారు. సర్పంచ్‌లను ప్రస్తుత మున్న ప్రత్యక్ష పద్దతిలో కాకుండా పరోక్ష పద్దతిలో ఎన్నుకొనే విధానాన్ని ప్రవేశ పెట్టాలనుకుంటున్నారు. ఫిబ్రవరిలో పంచాయితీలు ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ దిశలో కలెక్టర్ల సమావేశంలో సీఎం సంకేతాలిచ్చారు. 

అయితే ఇప్పుడు ఈ కొత్త చట్టమే అధికార ఎమ్మెల్యేలను ఆందోళన పరుస్తోంది. పార్టీ గుర్తుల మీద ఎన్నికలు జరిపిస్తే చాలా మంది టికెట్లు ఆశిస్తారు. అధికార పార్టీలో పెద్ద ఎత్తున పోటి ఉంటుంది. వార్డుకు ఒకరికే టికెట్ దక్కుతుంది. అలాంటప్పుడు మిగిలిన వారు అసంతృప్తి వ్యక్తం చేసే ప్రమాదం ఉంది.  సర్పంచ్‌ ఎన్నికను పరోక్ష పద్ధతిలో నిర్వహించడం కూడా ప్రమాదమంటున్నారు. వార్డులో గెలిచిన ప్రతి అభ్యర్థి సర్పంచ్‌ పదవి ఆశిస్తారని, దీంతో పార్టీలో అసమ్మతి సెగ పెరిగే ప్రమాదముందని స్థానిక ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. ఎమ్మెల్యే వల్లే తమకు అన్యాయం జరిగిందని అవకాశాలు రాని వారు వ్యతిరేకులుగా మారే ఛాన్సుందంటున్నారు. దీంతో వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అనుచర వర్గం బలహీన పడుతుందనే భయం స్థానిక ఎమ్మెల్యేలను, మరీ ప్రత్యేకించి అధికార పార్టీ ప్రజా ప్రతినిధులను వెన్నాడుతోంది. 

గతంలో పార్టీ రహిత ఎన్నికలు అయినందున...అందరు స్వతంత్ర్య అభ్యర్ధులే. అందుకే ఆ ఎన్నికలతో సంబంధం లేనట్లుగా వ్యవహరించే వారమని....గెలిచిన అభ్యర్ధికి ఆ తర్వాత బాసటగా నిలిచేవారమంటున్నారు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు. గ్రామస్థాయిలో బలహీన పడకుండా ఉండడానికి పంచాయతీ ఎన్నికలను 2019 సార్వత్రిక ఎన్నికల తరువాత నిర్వహిస్తే బాగుంటుందని అధికారపార్టీ ప్రజా ప్రతినిధులు భావిస్తున్నారు. 

English Title
TRS Sitting MLAs Worried About Panchayati Raj

MORE FROM AUTHOR

RELATED ARTICLES