టీఆర్ఎస్ పార్టీకి షాక్...కాంగ్రెస్ లో చేరిన...

Submitted by arun on Thu, 07/05/2018 - 14:24
cong

అధికార టీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి వరంగల్ జిల్లాలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీఆర్ఎస్ పార్టీనాయకులు, పరకాల మున్సిపల్ చైర్మన్‌ మార్తిరాజు భద్రయ్య తన అనుచరులతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుని టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు. హైదరాబాద్ లోని ఉత్తమ్ ఇంట్లో జరిగిన ఈ కార్యక్రమంలో భద్రయ్యతో పాటు అతడి అనుచరులు భారీ సంఖ్యలో కాంగ్రెస్ లో చేరారు. అనంతరం ఉత్తమ్‌ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ జెండా ఎగిరి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లో చేరికలే ఇందుకు సాక్ష్యాలని అన్నారు. టీఆర్‌ఎస్‌ తప్పుడు విధానాలకు విరక్తి చేందే పరకాల చైర్మన్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారని, టీఆర్‌ఎస్‌ పాలన పట్ల ప్రజలు ఆగ్రహంతో కాంగ్రెస్‌కు పట్టం కడతారని పేర్కొన్నారు.  

English Title
trs parkal muncipal chairman joins congress

MORE FROM AUTHOR

RELATED ARTICLES