సవతితల్లి ప్రేమలా...

Submitted by arun on Thu, 08/09/2018 - 17:03
MP Jitender Reddy

తెలంగాణపై కేంద్రం ప్రభుత్వం యొక్క తీరు,

సవతితల్లి ప్రేమలా చూస్తున్నారు,ఎన్ని సార్లు అడిగిన ,

రక్షణ శాఖ భూములను బదలాయించరు వీరు,

అని నిరసిస్తూ ఎంపీ లోక్‌సభలో మాట్లాడారు. శ్రీ.కో


తెలంగాణపై కేంద్రం ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ ఎందుకు చూపుతుందని టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి ప్రశ్నించారు. రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించకపోవడాన్ని నిరసిస్తూ ఎంపీ లోక్‌సభలో మాట్లాడారు. బైసన్ పోలో, జింఖానా మైదానాలను రాష్ర్టానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఒకటో నంబర్ రాష్ట్ర రహదారి అభివృద్ధికి, 44వ నంబర్ జాతీయ రహదారికి రక్షణ శాఖ భూములివ్వాలని ఎంపీ డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం నుంచి స్పందన లేదని ఆయన ఆగ్రహం వెలిబుచ్చారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్నారని కోపోద్రిక్తులయ్యారు. ఇటీవల కర్ణాటక ప్రతిపాదనలకు వెంటనే ఆమోదం తెలిపిన విషయాన్ని ఎంపీ గుర్తు చేశారు. నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.

English Title
trs-mp-jitender-reddy-talks-on-defence-lands-in-loksabha

MORE FROM AUTHOR

RELATED ARTICLES