టీఆర్ఎస్ ఎమ్మెల్సీలలో అంతర్మథనం

x
Highlights

చట్ట సభల్లో ఎమ్మెల్సీలను పెద్దలుగా గౌరవిస్తారు గుర్తిస్తారు ఇంకా చెప్పాలంటే ఎమ్మెల్యేలకన్నా వారికే ఎక్కువ మర్యాద, మన్నన ఉంటాయి. కానీ ఇవన్నీ మాటల్లోనే...

చట్ట సభల్లో ఎమ్మెల్సీలను పెద్దలుగా గౌరవిస్తారు గుర్తిస్తారు ఇంకా చెప్పాలంటే ఎమ్మెల్యేలకన్నా వారికే ఎక్కువ మర్యాద, మన్నన ఉంటాయి. కానీ ఇవన్నీ మాటల్లోనే కనీసం కార్పొరేషన్ ఛైర్మన్లకున్న విలువా తమకు లేదని వాపోతున్నారు టిఆరెస్ఎమ్మెల్సీలు ఎందుకు? వారికేమైంది?

టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీల పరిస్థితి మరీ ఇబ్బందికరంగా తయారవుతోంది. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల కన్నా అధిక గౌరవం పొందాలి. కాని క్షేత్ర స్థాయిలో అలాంటి పరిస్థితి లేదు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలకే పెద్ద పీట వేస్తు ఎమ్మెల్సీలను చిన్న చూపు చూస్తున్నారనే అసంతృప్తి పెరుగుతోంది. దీనిపై ఎన్నో సార్లు ఎమ్మెల్సీలు అధికారుల మీద ఫైరయ్యారు. అయినా ఫలితం లేదు. ఎమ్మెల్సీలను మీటింగ్ లకు పిలుస్తున్నా వారి అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కనీసం ఎమ్మెల్సీల అభివృద్ధి నిధులను ఖర్చు చేసుకునే స్వేచ్చ కూడా వారికి ఉండటం లేదు. అదీ ఎమ్మెల్యేల సూచనల మేరకే నిధులను ఖర్చు చేయాల్సి వస్తోంది. ఎమ్మెల్యేల సూచనలు పాటించకపోతే వారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తోంది. సీఎం కేసీఆర్ కూడా ఎమ్మెల్యేలు, ఎమెల్సీలు కలిసి పని చేయాలని సూచించారు. ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీల జోక్యాన్ని తప్పుబట్టారు. నిధుల ఖర్చులో ఎమ్మెల్యేల సూచనలు పాటించాలని కోరారు. దీంతో ఎమ్మెల్సీల పరపతి మరింత తగ్గిపోయినట్లైంది.

తెలంగాణ మండలిలో మొత్తం 32 మంది ఎమ్మెల్సీలున్నారు. మండలి చైర్మన్ ముగ్గురు మంత్రులను మినహయిస్తే మిగిలిన 28 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాము నామమాత్రంగా మారిపోయామనే ఆవేదన లో ఉన్నారు. తమను మరీ కార్పోరేషన్ల చైర్మన్లలా పరిగణిస్తున్నారన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దల సభ సభ్యులుగా తమకు కనీస గౌరవం, ప్రాధాన్యత దక్కడం లేదని భావిస్తున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలు కావాలని పట్టుదలగా ఉన్నారు. ఎమ్మెల్యేలకు ఎక్కువ అధికారం, గౌరవం దక్కుతుండటంతో ఎట్టి పరిస్థితుల్లోనైనా ఎమ్మెల్యేలు కావాలని తలపోస్తున్నారు. అందుకే ఇప్పటికే నియోకవర్గాలను ఎంచుకుని అక్కడ పనిచేసుకుని పోతున్నారు. దీంతో చాలా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్ లతో విభేదాలు తలెత్తుతున్నాయి. కల్వకుర్తి, నిజామబాద్ రూరల్, భూపాల పల్లి, నిజామాబాద్ అర్బన్, మునుగోడు, కుత్బుల్లాపూర్, పెద్దపల్లి, మల్కాజిగిరి..ఇలా పదుల సంఖ్యలో నియోజకవర్గాల్లో గొడవలు జరుగుతున్నాయి. ఇవి ఎన్నికల నాటికి మరింత ముదిరే ప్రమాదం ఉండటంతో పార్టీ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories