కోదండరామ్‌కు దమ్ముంటే పార్టీ పెట్టి మాతో పోటీపడాలి

Submitted by admin on Tue, 12/12/2017 - 12:28

టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్‌కు దమ్ముంటే పార్టీ పెట్టి తమతో పోటీపడాలని ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వరరెడ్డి సవాల్ చేశారు. తెలంగాణ జేఏసీని నిరుద్యోగులు, ప్రజలు నమ్మడం లేదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పల్లా మీడియాతో మాట్లాడారు. కొలువుల కొట్లాట సభకు ప్రజల స్పందన లేదని విమర్శించారు. కాంగ్రెస్‌, కోదండరామ్‌‌లు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టులు ఆగవని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులంతా ప్రజలచేత ఎన్నుకోబడినవారేనని రాజేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఓయూలో విద్యార్థి మురళి ఆత్మహత్యను రాజకీయం చేయడం బాధాకరమన్నారు. ఒంటేరు ప్రతాప్‌రెడ్డి అనే వ్యక్తి గూండాలతో క్యాంపస్‌లోకి ప్రవేశించారని తెలిపారు. కుట్రపూరితంగా పోలీసులపై రాళ్లతో దాడి చేయించారని చెప్పారు. మురళీ సూసైడ్‌ నోట్‌ రాతపై కోదండరామ్‌ అనుమానాలు వ్యక్తం చేయడం బాధాకరమనిన్నారు.

English Title
trs-mlc-palla-rajeshwar-reddy-fire-kodandaram

MORE FROM AUTHOR

RELATED ARTICLES