ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్‌ సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Fri, 01/12/2018 - 16:48
srinivas goud

టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి అన్న మాటలు నూటికి నూరుపాళ్లు వాస్తవమన్నారు. ఉద్యమంతో సంబంధం లేని వాళ్లు క్యాబినెట్‌లో ఉన్నారని శ్రీనివాసగౌడ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అది తలుచుకుంటే కన్నీరు వస్తుందని వాపోయారు శ్రీనివాసగౌడ్‌. కేసీఆర్‌ నిర్ణయం వెనుక ఏదో కారణం ఉండి ఉండొచ్చన్న శ్రీనివాసగౌడ్‌.... ఉద్యోగులు లేనిదే అసలు సకల జనుల సమ్మె లేదన్నారు. 

తెలంగాణ ఉద్యమం సమయంలో లేని వారు తెలంగాణ కోసం పనిచేయని వారు ఇప్పుడు మాట్లాడుతున్నారని శ్రీనివాసగౌడ్‌ అన్నారు. ఉద్యోగులు లేనిదే సకల జనుల సమ్మె లేదన్న శ్రీనివాసగౌడ్‌... తెలంగాణ కోసం ఏమీ చేయని వారిని క్యాబినెట్‌లో కేసీఆర్‌ ఏదో బలమైన కారణంతోనే తీసుకొని ఉంటారని అన్నారు. కాకపోతే ఇది తలుచుకున్నప్పడల్లా.. కంటికి నీరు వస్తుందని శ్రీనివాసగౌడ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.
 

English Title
trs mla srinivas goud sensational comments

MORE FROM AUTHOR

RELATED ARTICLES