కోమటిరెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నా.. రాజీనామాకు సై!

కోమటిరెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నా.. రాజీనామాకు సై!
x
Highlights

డీసీసీబీ సీఈవోపై వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్యే వీరేశం స్పష్టం చేశారు. సస్పెండైన డీజీఎం లక్ష్మికి న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది...

డీసీసీబీ సీఈవోపై వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్యే వీరేశం స్పష్టం చేశారు. సస్పెండైన డీజీఎం లక్ష్మికి న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి విసిరిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నట్టు టీఆర్‌ఎస్‌ నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రకటించారు. 'కోమటిరెడ్డి సోదరులు ఇద్దరూ రాజీనామా చేయాలి. నేను కూడా రాజీనామా చేస్తాను. నకిరేకల్‌లో నేను ఓడిపోతే.. రాజకీయ సన్యాసం తీసుకుంటాను. మీరు ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటారా?' అని ప్రశ్నించారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ డబ్బులతో రాజకీయాలను కలుషితం చేశారని ఆరోపించారు. ఎంపీగా భువనగిరికి రాజగోపాల్‌రెడ్డి చేసిందేమిటో చెప్పాలని వీరేశం ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories