ముందస్తు వేడి మధ్య మరో భారీ బహిరంగసభ

x
Highlights

ముందస్తు ఎన్నికల ఊహాగానాల మధ్య హుస్నాబాద్‌ సభపైనే అందరి దృష్టి ఉంది. అసెంబ్లీ రద్దుకు సీఎం కేసీఆర్ ముహూర్తం ఖరారు చేశారన్న ప్రచారం మధ్య ఈనెల 7న...

ముందస్తు ఎన్నికల ఊహాగానాల మధ్య హుస్నాబాద్‌ సభపైనే అందరి దృష్టి ఉంది. అసెంబ్లీ రద్దుకు సీఎం కేసీఆర్ ముహూర్తం ఖరారు చేశారన్న ప్రచారం మధ్య ఈనెల 7న హుస్నాబాద్‌లో గులాబీ దళం భారీ బహిరంగ సభను నిర్వహించబోతోంది. ఇప్పటికే మంత్రి హరీష్‌రావు, ఈటెల రాజేందర్‌ సభాస్థలాన్ని పరిశీలించారు. హుస్నాబాద్‌ డిపో సమీపంలో భూమి పూజ చేసిన మంత్రులు సభాస్థలికి ప్రజా ఆశీర్వాద సభగా పేరు ఖరారు చేశారు.

తెలంగాణ ముందస్తుగా రాజకీయం వేడెక్కుతోంది. భారీ బహిరంగ సభ అంటూ గులాబీదళం గర్జిస్తోంది. ఈనెల 7న హుస్నాబాద్‌ మధ్యాహ్నం 2 గంటలకు 65వేలకు తక్కువ కాకుండా భారీ జనసమీకరణతో మరో సభ నిర్వహించేందుకు టీఆర్‌ఎస్‌ సిద్ధమవుతుంది. సిద్దిపేటలో బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్‌ సమీక్షించారు.

హుస్నాబాద్ టౌన్, హుస్నాబాద్ మండలం నుంచి 15 వేలు, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి నుంచి 16 వేలు, అక్కన్నపేట్ నుంచి 10 వేలు, కోహెడ, సైదాపూర్ నుంచి 20 వేలు, చిగురుమామిడి నుంచి 6 వేల మందిని సభకు తీసుకువచ్చే విధంగా ప్రణాళికలు, కార్యాచరణ సిద్ధం చేయాలని మంత్రులు కోరారు. సభను జయప్రదం చేసేందుకు చిగురుమామిడి మండలానికి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, సైదాపూర్ మండలానికి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, కోహెడకు మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, అక్కన్నపేటకు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, భీమదేవరపల్లికి ఎమ్మెల్యే పుట్టా మధు, టూరిజం కార్పూరేషన్ చైర్మన్ భూపతిరెడ్డి, ఎల్కతుర్తికి మెట్పల్లి ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, హుస్నాబాద్ టౌన్, రూరల్‌కు హరీష్‌రావు, ఎంపీ వినోద్‌కుమార్, పాతురి సుధాకర్‌రెడ్డిలు బాధ్యులుగా ఉన్నారు.

7వ తేదీ నాడు జరిగే భారీ బహిరంగసభకు ప్రజాఆశీర్వాద సభగా పేరు ఖరారు చేసిన గులాబీదళం సమీప గ్రామాల్లోని ప్రజలు పాద యాత్రలు, గిరిజన నృత్యాలు, మోటార్ సైకిల్ ర్యాలీలతో రావాలని క్యాడర్‌కు సూచించింది. 5, 6 తేదీల్లో మండలాల్లో పార్టీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కూడా మంత్రులు హరీష్‌రావు, ఈటల ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories