ఎన్నికల వేల స్పీడ్ పెంచిన కారు...కేటీఆర్ చుట్టూ తిరుగుతున్న 14 నియోజక వర్గాల ఆశావాహులు

ఎన్నికల వేల స్పీడ్ పెంచిన కారు...కేటీఆర్ చుట్టూ తిరుగుతున్న 14 నియోజక వర్గాల ఆశావాహులు
x
Highlights

ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష ముమ్మరం చేసింది వివిధ నియోజక వర్గాల్లోని కాంగ్రెస్, టీడీపీ క్యాడర్‌ను కారెక్కిస్తోంది కేటీఆర్ స్వయంగా గులాభి...

ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష ముమ్మరం చేసింది వివిధ నియోజక వర్గాల్లోని కాంగ్రెస్, టీడీపీ క్యాడర్‌ను కారెక్కిస్తోంది కేటీఆర్ స్వయంగా గులాభి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు మరోవైపు పద్నాలుగు నియోజక వర్గాల ఆశావాహులతో కేటీఆర్‌ను కలిసి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు.

ఎన్నికల వేల కారు స్పీడ్ పెంచింది ఆపరేషన్ ఆకర్ష‌లో భాగంగా ఇతర పార్టీల నేతలను టీఆర్ఎస్ లో చేర్చుకునేందుకు దృష్టి సారించింది. నియోజక వర్గాల్లోని వివిధ రాజకీయ పార్టీల కింది స్థాయి క్యాడర్‌ను పార్టీ లోనికి ఆహ్వానిస్తోంది. తెలంగాణ భవన్ వేదికగా మంత్రి కేటీఆర్ స్వయంగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. దీంతో తెలంగాణ భవన్ కోళాహలంగా మారుతోంది.

మరోవైపు ప్రచారంలోనూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను పరుగులు పెట్టిస్తోంది ఇప్పటికే టిక్కెట్లు దక్కించుకున్న నేతలు ముమ్మర ప్రచారం చేస్తున్నారు దీంతో ఇంక ప్రకటించని పద్నాలుగు నియోజక వర్గాల ఆశావాహులు కేసీఆర్ నుంచి ఎప్పుడు ప్రకటన వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు అటు ప్రగతి భవన్ ఇటు తెలంగాణ భవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.

ఇక ఆశావాహులు కేటీఆర్‌ను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు చెన్నూరు టికెట్టు తన సోదరుడు మాజీ మంత్రి వినోద్‌కు ఇవ్వాలంటూ మాజీ ఎంపీ వివేక్ కోరినట్లు సమాచారం కేసీఆర్ తో చర్చిస్తానని కేటీఆర్ వాళ్లకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ముషీరాబాద్ టికెట్టు తన అల్లుడు శ్రీనివాస్ రెడ్డికి గాని తనగ్గాని ఇవ్వాలని హోం మంత్రి నాయిని కోరారు. వరంగల్ ఈస్ట్ నుంచి మహిళగా తనకు అవకాశం ఇవ్వాలని మాజీ ఎంపీ గుండు సుధారాణి కేటీఆర్‌ను కోరారు. కోదాడ నుంచి శశిధర్ రెడ్డి, హుజూర్ నగర్ నుంచి శంకరమ్మలు కేటీఆర్ ను కలిసి తమకే అవకాశం కల్పిస్తే విజయం సాధిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. ఖైరతాబాద్ టికెట్టు తనకు ఇవ్వాలి కార్పోరేటర్ మన్నె కవిత కేటీఆర్ ను కలిసి కోరారు. మొత్తానికి ఓవైపు చేరికలు మరోవైపు ఆశావాహులతో సమావేశాలు నిర్వహిస్తూ మంత్రి కేటీఆర్ బిజీబీగా అయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories