‘ఈయన చేరికతో కాంగ్రెస్‌కు మరింత బలం’

Submitted by arun on Fri, 09/21/2018 - 17:34
cong

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభంజనం వీస్తోందన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. వచ్చే ఎన్నికలు కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్ మధ్య కాదని, కేసీఆర్‌ కుటుంబం, తెలంగాణ ప్రజలకు మధ్య అని చెప్పారు. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్‌లో 10 నియోజకవర్గాలకు గాను ఒక్క స్థానంలో గెలిచామని, ఈ సారి పదికి పది గెలిపించేందుకు నేతలు కృషిచేయాలని పిలుపునిచ్చారు. 

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి. ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ దంపతులు తమ అనుచరులతో కలిసి పీసీసీ చీఫ్ ఉత్తమ్‌, సీనియర్ నేత జానారెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభంజనం వీస్తోందన్నారు. అక్టోబర్‌ మధ్యలో ఎన్నికల ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉందని, నవంబర్‌ లేదా డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. 

రమేశ్‌ రాథోడ్‌ చేరికతో ఆదిలాబాద్‌ జిల్లాలో పార్టీ బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఉత్తమ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎస్సీ, గిరిజనులను అణిచివేస్తున్నారని మండిపడ్డారు. అమరుల త్యాగాలతో కుర్చీ ఎక్కిన కేసీఆర్‌ వారినే విస్మరించారన్నారు. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్‌లో 10 నియోజకవర్గాలకు గాను ఒక్క స్థానంలో గెలిచామని, ఈ సారి పదికి పది గెలిపించేందుకు నేతలు కృషిచేయాలని పిలుపునిచ్చారు. 

వచ్చే ఎన్నికలు కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్ మధ్య కాదని, కేసీఆర్‌ కుటుంబం, తెలంగాణ ప్రజలకు మధ్య అని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఏక కాలంలోనే  2లక్షల రుణమాఫీ చేస్తామని, రాష్ట్రంలో పండే 17 ముఖ్య పంటలకు మంచి ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు ఉత్తమ్. మొత్తానికి ముందస్తు హడావిడి కాంగ్రెస్‌లోనూ మొదలైంది. భారీగా వలసలతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్ నెలకొంది.

English Title
trs leader ramesh rathod join congress party

MORE FROM AUTHOR

RELATED ARTICLES