ఏపీ బంద్‌లో పాల్గొన్న టీఆర్‌ఎస్ నేత!

Submitted by arun on Thu, 02/08/2018 - 16:04
trs leader

అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం జరిగిందంటూ వామపక్షాలు ఇవాళ బంద్ కు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే..ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లాల్లో బంద్ విజయవంతమైంది. విజయవాడలో వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన బంద్‌కు టీఆర్‌ఎస్ కార్యకర్త కొణిజేటి ఆదినారాయణ సంఘీభావం తెలిపారు. విజయవాడ లెనిన్ సెంటర్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై తలపెట్టిన పోరాటానికి తెలంగాణ ఎంపీలను కూడా మద్దతు తెలపమని కోరతామని ఆదినారాయణ చెప్పారు.

English Title
trs leader participated in ap bundh

MORE FROM AUTHOR

RELATED ARTICLES