మరో వివాదంలో జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

Submitted by arun on Fri, 04/13/2018 - 14:56

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరో భూవివాదంలో ఇరుక్కున్నారు. ఇప్పటికే చెరువు శిఖం భూముల ఆక్రమణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తాజాగా మరో భూవివాదంలో ఇరుక్కోవడం స్థానికంగా సంచలనం రేపుతోంది. జనగామ-హైదరాబాద్ రోడ్డుపై తన స్థలంలో ఇల్లు కట్టకుండా ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకున్నారంటూ బాధితుడు నర్సింహులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పెట్రోల్‌, పురుగులమందు డబ్బాలతో వేపచెట్టుపైకి ఎక్కిన బాధితుడు తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగాడు. అయితే నచ్చజెప్పి కిందికి దించిన పోలీసులు నర్సింహలును అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించారు.

English Title
TRS Jangoan MLA Mutireddy Yadagiri Reddy alleged

MORE FROM AUTHOR

RELATED ARTICLES