నిఘా ఉంది.. నివేదికలొస్తున్నాయి!! హుషార్‌ తగ్గొద్దు... బేజారు కావొద్దు!!

నిఘా ఉంది.. నివేదికలొస్తున్నాయి!! హుషార్‌ తగ్గొద్దు... బేజారు కావొద్దు!!
x
Highlights

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. టీఆర్ఎస్ అభ్యర్ధులు, బలమైన ప్రత్యర్ధుల ప్రచార శైలిని గమనిస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని...

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. టీఆర్ఎస్ అభ్యర్ధులు, బలమైన ప్రత్యర్ధుల ప్రచార శైలిని గమనిస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రభుత్వానికి చేరవేస్తున్నాయి. అభ్యర్ధుల బలాలు బలహీనతలను బేరీజు వేసి నివేదికలు సమర్పిస్తున్నాయి. అనుగుణంగా పలువురు అభ్యర్ధులు తమ ప్రచార వ్యూహన్ని మార్చుకునేలా ఆదేశాలు అందుతున్నాయి. రాష్టంలో ముందస్తు ఎన్నికల వేడి పెరిగింది. టీఆర్ఎస్ అభ్యర్ధులు ప్రచారంలో వేగం పెంచారు. విపక్షాలు ఇంకా అభ్యర్ధులను ప్రకటించకపోవడంతో ప్రచారం మొదలు కాలేదు. కాని నిఘా వర్గాలు మాత్రం తమ పనిని మొదలుపెట్టాయి. ఎన్నికల ప్రచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు నియోజకవర్గ వర్గాల వారీగా రంగంలోకి దిగాయి. ప్రతి నియోజకవర్గంలో మొత్తం ఆరుగురు సభ్యుల ఇంటలిజెన్స్ బృందం తన పనిని ప్రారంభించింది.

ఒక ఎస్సై, ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్, ముగ్గురు కానిస్టెబుల్స్‌తో కూడిన బృందం ప్రచార శైలి, ప్రజా స్పందనపై సమాచారాన్ని సేకరిస్తుంది. నిబంధనల ప్రకారం రాజకీయ పార్టీలకు పోలీసులు పనిచేయకూడదు. అందుకే తమ సమాచార సేకరణనను అంత్యంత గోప్యంగా నిర్వహిస్తున్నారు. ఎవ్వరికి అనుమానం రాకుండా సర్వే సంస్థలు, నేషనల్ మీడియా, పరిశోధన సంస్థల పేర్లతో నియోజకవర్గాల్లో కొనసాగుతున్న ప్రచారాన్ని ఫాలో అవుతున్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధుల ప్రచారంపైనే నిఘా బృందం దృష్టి పెట్టింది. అభ్యర్ది ప్రచార శైలి ఎలా ఉంది? ప్రభుత్వ పథకాలను, టీఆర్ఎస్ సర్కార్ సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారా? విపక్షాల విమర్శలను గట్టిగా తిప్పికొడుతున్నారా? సామాజిక వర్గాల వారీగా అభ్యర్థికున్న ఆదరణ వంటి విషయాలపై సమాచారాన్ని సేకరిస్తున్నారు. వీరే కాకుండా ప్రభావశక్తులు ఎటు వైపు మొగ్గుతున్నారు? టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉన్నారా? వ్యతిరేకంగా ఉన్నారా? వంటి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.

అభ్యర్ధులు ఎవరెవర్ని కలుస్తున్నారన్న విషయాలనూ సేకరిస్తున్నారు. అదే సమయంలో అసమ్మతి నేతలు, ప్రత్యర్ధి పార్టీల అభ్యర్ధుల కార్యకలాపాలపై కన్నేసారు. అసంతృప్తులతో టీఆర్ఎస్‌కు ఎంత నష్టం, విపక్ష ఆశవహుల బలాలు బలహీనతలు, వారి సన్నాహక సమావేశాలు, లెవనెత్తుతున్న అంశాలను సేకరించడంతో పాటు వారి ర్యాలీలను ఫాలో అవుతున్నారు. ఇలా టీఆర్ఎస్ అభ్యర్ధులు, వారి ప్రత్యర్ధుల ప్రచార శైలి, ప్రజా స్పందనను బేరీజు వేసి రోజు వారి నివేదికలను ప్రభుత్వానికి అందజేస్తున్నారు. ఈ నివేదికలు ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీకి చేరుతున్నాయి. టీఆర్ఎస్‌లో ఈ నివేదికల అద్యయనం కోసం తెర వెనక ఎంపీ సంతోష్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో ఓ టీం పనిచేస్తుంది. తమకొచ్చిన నివేదికలను సమగ్రంగా అధ్యయనం చేసి, తమ దగ్గర ఉన్న ఓటర్ల జాబితా, సంక్షేమ పథకాల లబ్దిదారులు, సామజిక వర్గాలు, సర్వే డేటాతో పొల్చి చూస్తున్నారు. తమ పార్టీ అభ్యర్ధుల లోటు పాట్లను పరిశీలించి అనుగుణంగా ప్రచార శైలిలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈ సమాచారాన్ని వెంటనే అభ్యర్థులకు చేరవేసి... .ప్రచార వ్యూహాలను మార్చుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. ఈ పని ప్రస్తుతానికి ప్రయోగత్మకంగా సాగుతున్నా ఎన్నికల షెడ్యుల్ నాటికి మరింత పటిష్టంగా జరిగేలా టీఆర్ఎస్ జాగ్రత్తలు తీసుకుంటుంది. అభ్యర్థులు చేస్తున్న పొరపాట్లను సరిదిద్దడం ద్వారా ప్రత్యర్ధులపై ఆధిపత్యం ప్రదర్శించవచ్చని...దీంతో తమ గెలుపు ఖాయమవుందని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది. అందుకే ఇప్పటి నుంచే నిఘా వర్గాలకు పనని అప్పజెప్పాయి.

పూర్తిగా నిఘా వర్గాలనే నమ్ముకోకుండా....సర్వే సంస్థలను సైతం రంగంలోకి దించింది. తెలంగాణ రాజకీయాలపై పూర్తి అవగాహన ఉన్న వీరు స్వతంత్రంగా తమదైన రీతిలో ప్రచారం, ప్రజ స్పందన పై అడపా దడపా సమాచారాన్ని సేకరిస్తున్నారు. వీటన్నింటిని క్రోడీకరించడం ద్వారా ప్రత్యర్ధులపై పై చేయి సాధించ వచ్చని భావిస్తున్నారు గులాబి పెద్దలు. అయితే తెలంగాణలో నిశబ్ద విప్లవం నడుస్తుందన్న విపక్షాల అంచనాతో...టీఆర్ఎస్ ప్రయత్నాలు ఎంత మేరకు ఫలిస్తాయో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories