ప్రతి రైతుకూ రూ.5 లక్షలు

Submitted by arun on Fri, 03/09/2018 - 11:00
kcr

ప్రతి రైతు పేరిటా 5 లక్షల రూపాయల బీమా. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయనున్న కొత్త పథకమిది. రాష్ట్రంలో ఉన్న 72 లక్షల మంది రైతు కుటుంబాలకు బీమా ఫలాన్ని అందజేసేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. రైతు.. ఆత్మహత్య చేసుకుంటేనో, ప్రమాదవశాత్తు మృతిచెందితేనో ఆ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు 6 లక్షల రూపాయల పరిహారం అందిస్తోంది. కానీ ఇప్పుడు ప్రతీ రైతు మరణానంతరం ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు అందేలా ప్రభుత్వం బీమా పథకాన్ని అమలులోకి తెస్తోంది. అంటే రైతు సహజంగా మరణించినా ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు అందుతాయన్నమాట. 

ఏడాదికి 330 రూపాయల ప్రీమియం చెల్లిస్తే దేశంలో ఎవరికైనా 2 లక్షల రూపాయల బీమాను కేంద్రం అందిస్తోంది. దానికి అదనంగా ఒక్కో రైతు పేరిట మరో 300 రూపాయల ప్రీమియం తెలంగాణ ప్రభుత్వమే చెల్లించి 5 లక్షల రూపాయల బీమా పథకాన్ని అమలులోకి తీసుకొస్తోంది. అంటే రైతు కుటుంబానికి అందే బీమాలో కేంద్రం 2 లక్షల రూపాయలు అందిస్తుండగా, రాష్ట్రం 3 లక్షల రూపాయలు అందిస్తుంది. 

ఈ పథకం కోసం 5 వందల కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ తక్షణమే రైతులకు బీమా కార్డులు అందజేసేందుకు బీమా కంపెనీలతో చర్చలు జరుపుతోంది. ఈ పథకం అమలైతే 6 లక్షల రూపాయల పరిహార పథకాన్ని రద్దు చేయొచ్చని, అలాగే రైతు ఆత్మహత్యలపై దుమారం రేపే విపక్షాలను కట్టడి చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. 

ఈ పథకంతో ప్రతి రైతు మరణానంతరం 5 లక్షల రూపాయలు అందిస్తే రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టే అవకాశముంది. అలాగే రాష్ట్ర వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని వ్యవసాయ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

English Title
Trs government palan new scheme for farmers

MORE FROM AUTHOR

RELATED ARTICLES