పవర్ వార్ పై టీఆర్ఎస్ కొత్త ట్విస్ట్..రేవంత్ సవాల్ కు టీఆర్ఎస్ నై

పవర్ వార్ పై టీఆర్ఎస్ కొత్త ట్విస్ట్..రేవంత్ సవాల్ కు టీఆర్ఎస్ నై
x
Highlights

టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పవర్ వార్ కొనసాగుతోంది. విద్యుత్ పై చర్చకు కాంగ్రెస్ తో సిద్ధమంటూనే టీఆర్ఎస్ కొత్త మెలిక పెట్టింది. చర్చకు తాము సిద్ధమంటూనే.....

టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పవర్ వార్ కొనసాగుతోంది. విద్యుత్ పై చర్చకు కాంగ్రెస్ తో సిద్ధమంటూనే టీఆర్ఎస్ కొత్త మెలిక పెట్టింది. చర్చకు తాము సిద్ధమంటూనే.. రేవంత్ రెడ్డి సవాల్ కు మాత్రం నై అంటోంది. రేవంత్ కాకుండా, ఆ నలుగురు అయితే.. తమకు ఓకే అంటున్నారు అధికార పార్టీ నేతలు. దీంతో పవర్ పాలిటిక్స్ ఇరు పార్టీల మధ్య హై ఓల్టేజీని రాజేస్తోంది.

తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్లు, ఒప్పందాలకు సంబంధించిన చర్చపై అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సవాల్ కు సై అన్న టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు స్వరం మార్చారు. పవర్ వార్ పై రేవంత్ రెడ్డికి బాల్క సుమన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. చర్చకు రావాలన్న రేవంత్ రెడ్డి సవాల్ ను తిప్పికొట్టారు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగని.. దొంగతో చర్చించేదేంటని బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. విశ్వసనీయత లేని వ్యక్తులతో చర్చించే ప్రసక్తలేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ నుంచి జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి వస్తే చర్చిస్తామని చెప్పారు.

బాల్కసుమన్ కామెంట్స్ పై స్పందించిన రేవంత్ రెడ్డి.. అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం, చర్చల నుంచి పారిపోయిందన్నారు. మీడియా సమావేశంలో టీఆర్ఎస్ అవినీతిని బయటపెడతానని కౌంటర్ ఎటాక్ కి దిగారు. పట్టపగలు ప్రభుత్వం చీకటి ఒప్పందాలు బట్టబయలు అయ్యాయని అన్నారు. తెలంగాణలో విద్యుత్‌పై లోతుగా విశ్లేషించాననే.. తనతో చర్చకు భయపడుతున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు.

పవర్ వార్ బంతిని టీఆర్ఎస్, కాంగ్రెస్ కోర్టులోకి విసిరింది. చర్చకు సిద్ధమంటూనే రేవంత్ రెడ్డి వద్దని.. కాంగ్రెస్ నుంచి ఆ నలుగురే చర్చకు రావాలని టీఆర్ఎస్ ప్రతిసవాల్ విసిరింది. అయితే, రేవంత్ మాత్రం శుక్రవారం మీడియా సమావేశంలో టీఆర్ఎస్ అవినీతి బాగోతాన్ని బయటపెతానని చెబుతున్నారు. మొత్తం మీద పవర్ పాలిటిక్స్ రాష్ట్ర రాజకీయాలను మరోసారి హీటెక్కించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories