పాపం.. టీడీపీ, టీఆర్‌ఎస్‌లకు ఏమిటీ గతి?

పాపం.. టీడీపీ, టీఆర్‌ఎస్‌లకు ఏమిటీ గతి?
x
Highlights

అభివృద్ధిలో పోటా పోటీగా తెలుగు రాష్ట్రాల్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు తమ పార్టీలను మాత్రం అప్పుల నుంచి గట్టెక్కించలేకపోతున్నారు....

అభివృద్ధిలో పోటా పోటీగా తెలుగు రాష్ట్రాల్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు తమ పార్టీలను మాత్రం అప్పుల నుంచి గట్టెక్కించలేకపోతున్నారు. పుట్టెడు అప్పులతో పార్టీలను నడిపిస్తున్నట్లు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్ తాజా నివేదిక వెల్లడించింది.

దేశంలో సంపన్న ప్రాంతీయ పార్టీ ఏదో తెలుసా? అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో నడుస్తున్న సమాజ్ వాదీ పార్టీ. ఇక తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, టీఆర్ఎస్ అప్పులు పాలవ్వగా, వైసీపీ మాత్రం సొంత ఆస్తులతో తులతూగుతోందని ఏడీఆర్ స్పష్టం చేసింది. నిన్న మొన్న వచ్చిన ఆమ్ ఆద్మీ కూడా ఆస్తులు సమకూర్చుకున్నా టీడీపీ, టీఆర్ఎస్ వంటి పార్టీలు అప్పుల్లో ఉండటం విశేషం.

తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగు దేశం పార్టీ అప్పులో ఉన్నాయని అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రాటిక్‌ రిఫామ్స్‌ నివేదిక వెల్లడించింది. టీఆర్‌ఎస్‌కు 15.97 కోట్ల రూపాయలు టీడీపీకి 8.18 కోట్ల రూపాయల మేర అప్పులు ఉన్నట్లు పేర్కొంది. వైసీపీకి 1.16 కోట్ల రూపాయల మేర ఆస్తులున్నాయని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆస్తులు 3.76 కోట్ల రూపాయలు అని ఏడీఆర్ తెలిపింది.

దేశంలోని ప్రాంతీయ రాజకీయ పార్టీల్లో అఖిలేశ్‌ యాదవ్‌ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ అధిక నికర ఆస్తులను కూడబెట్టుకుందని అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రాటిక్‌ రిఫామ్స్‌ నివేదిక వివరించింది. 2011-12లో సమాజ్‌వాదీకి 212.86 కోట్ల రూపాయల ఆస్తులుండగా 2015-16లో అవి 634.96 కోట్ల రూపాయలకు అంటే 198 శాతం పెరిగినట్లు ఏడీఆర్‌ ప్రకటించింది. తమిళనాడులోని ఏఐఏడీఎంకే రెండో స్థానంలో నిలిచింది. ఈ పార్టీకి 2011-12లో 88.21 కోట్ల రూపాయలఆస్తులుండగా 2015-16లో అవి 155 శాతం అంటే 224.87 కోట్ల రూపాయల మేర పెరిగినట్లు చెబుతోంది.

ఒకవైపు దేశంలోనే సంపన్నంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన టీఆర్‌ఎస్ పార్టీ, మరోవైపు ఎప్పుడో 1983లో పుట్టి అశేష ప్రజాబలం, అధికార బలం ఉన్న టీడీపీ వంటి పార్టీలు అప్పుల్లో ఎలా ఉన్నాయో అర్థం కావడం లేదంటూ ప్రజలు తలలు పట్టుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories