బాత్రూమ్స్‌ కట్టిన త్రిష

Submitted by arun on Sun, 12/31/2017 - 11:16
trisha

చెన్నై బ్యూటీ త్రిష న‌టిగానే కాదు సోష‌ల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్య‌క్తి కూడా. యూనిసెఫ్‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉన్న త్రిష ప్ర‌జ‌ల‌లో అవ‌గాహాన క‌లిపించేందుకు అప్పుడ‌ప్పుడు ప‌లు సామాజిక కార్య‌క్ర‌మాలు చేప‌డుతూనే ఉంటుంది. ఇంక పెటా ద్వారా జంతువుల‌ సంర‌క్ష‌ణ బాధ్య‌త‌ని కూడా తీసుకుంది. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా కాంచీపురం జిల్లాలోని నెమలి గ్రామంలో నాలుగు మరుగుదొడ్లను నిర్మించేందుకు తన వంతు సాయం చేశారు త్రిష. సిమెంట్‌ను తన చేతులతో కలిపిన త్రిష.. ఇటుకలను వరుసలో పెట్టి నిర్మాణ పనులను ప్రారంభించడం విశేషం. మరుగుదొడ్ల నిర్మాణంపై మాట్లాడిన త్రిష.. స్వచ్ఛ భారత్‌కు తన వంతు సాయం అందించడం ఆనందంగా ఉందని అన్నారు.
Image removed.

English Title
Trisha Sanitation Awareness creation

MORE FROM AUTHOR

RELATED ARTICLES