త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో రసవత్తర పోరు

త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో రసవత్తర పోరు
x
Highlights

త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. మొత్తం 60 నియోజకవర్గాలకు గాను 59 స్థానాలకు.. సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈసారి అధికార...

త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. మొత్తం 60 నియోజకవర్గాలకు గాను 59 స్థానాలకు.. సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈసారి అధికార లెఫ్ట్‌, బీజేపీకి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల కమిషన్ పోలింగ్ కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. త్రిపుర ఎన్నికల పోలింగ్‌ లో 60 నియోజకవర్గాలకు గాను 297మంది అభ్యర్ధులు పోటీపడుతుండగా.. సుమారు 25లక్షల 79వేల మంది ఓటు హక్కు వినియోగించకోనున్నారు. త్రిపుర అసెంబ్లీకి పోటీపడుతున్నవారిలో 20మంది మహిళలు ఉండగా.. మహిళా ఓటర్లు 12లక్షల 68వేల మంది వరకు ఉన్నారు.

అధికార సీపీఎం 57మంది అభ్యర్థులను బరిలోకి దింపగా, లెఫ్టెఫ్రెంట్ భాగస్వామ్య పార్టీలైన సీపీఐ, ఫార్వార్డ్ బ్లాక్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీలు ఒక్కో స్థానం నుంచి పోటీ చేస్తున్నాయి. బీజేపీ 51 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఇక కాంగ్రెస్ పార్టీ 59 స్థానాల్లో, తృణమూల్ కాంగ్రెస్ 24 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి మానిక్ సర్కార్ ధన్‌పూర్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నారు.

పాతికేళ్లుగా త్రిపురలో సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలో కొనసాగుతోంది. ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలన్న కసితో ఉన్న బీజేపీ.. లెఫ్ట్‌ ఫ్రంట్‌కు గట్టిపోటీనిస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో పట్టుకోసం ప్రయత్నిస్తోన్న మోడీ, అమిత్‌షాలు త్రిపురలో బీజేపీ సర్కార్ ఏర్పాటే లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డారు. తొలిసారి బీజేపీ నుంచి గట్టిపోటీ ఇవ్వనుండటంతో.. అధికార లెఫ్ట్ ఫ్రంట్ కూడా ఎన్నడూలేనివిధంగా విస్త్రత ప్రచారం నిర్వహించింది.

సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు.. సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న ఈశాన్యా రాష్ట్రాల ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. త్రిపురలో ఎన్నికలు మోడీ-అమిత్‌ షా జోడీకీ ఓ సవాల్‌గా మారాయి. దేశంలో ఇప్పటికే 19 రాష్ట్రాల్లో పాగా వేసిన బీజేపీ- త్రిపురపై కన్నేసింది. ఇక్కడ పాతికేళ్లుగా సీపీఎం అధికారంలో ఉంది.. మాణిక్‌ సర్కార్‌ గత 20 ఏళ్లుగా తిరుగులేని నేతగా, ముఖ్యమంత్రిగా చక్రం తిప్పుతున్నారు. ఓ రకంగా ఈ ఎన్నికలు ఆయనకు, నరేంద్ర మోదీకి మధ్య ప్రత్యక్ష సవాల్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories