ప్రేమ జంటకు ఘోర అవమానం... నగ్నంగా ఊరేగింపు

Submitted by arun on Sat, 07/07/2018 - 13:17
Tribal

మేజర్లు ఒకరని మరొకరు ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకుంటే.. వారిని అడ్డుకునే హక్కు, శిక్షించే అధికారం ఎవరికీ లేదు.. అని ఓ వైపు న్యాయస్థానాలు తీర్పులు వెలువరిస్తున్నప్పటికీ.. ప్రేమికులకు శిక్షలు తప్పడం లేదు. పెద్దలకు ఇష్టం లేకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నారనే కారణంతో ఓ జంటకు గ్రామస్థులు పెద్ద శిక్షవేశారు. రాజస్థాన్‌ ఉదయ్‌పూర్ పరిధిలోని చీర్వాకు చెందిన సెర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక ప్రేమ జంటను నగ్నంగా గ్రామంలో ఊరేగించారు. అక్కడ గుమిగూడిన జనమంతా దీనిని వినోదంగా చూశారేతప్ప ప్రేమ జంటకు సహాయం చేసే ప్రయత్నం చేయలేదు. పైగా దీనిని వీడియో తీశారు. వివరాల్లోకి వెళితే..ఒక గ్రామానికి చెందిన యువకుడు మరో గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని గ్రామస్తులు వారిద్దరికీ శిక్ష విధించారు. ఇద్దరినీ పట్టుకుని లోదుస్తులు తొలగించి తాళ్లతో కట్టేశారు. అనంతరం గ్రామంలో ఊరేగించారు. జనాలు వారిని వీడియో తీస్తూ వినోదం చూశారు తప్పితే ఒక్కరంటే ఒక్కరు కూడా అడ్డుకునేందుకు ముందుకు రాకపోవడం విస్మయపరుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని ప్రేమ జంటను విడిపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉదయ్‌పూర్‌లోని సెర్ గ్రామంలో జరిగిందీ ఘటన.


 

English Title
Tribal woman and lover assaulted, paraded nude in Rajasthan's Udaipur

MORE FROM AUTHOR

RELATED ARTICLES