ఏకంగా జడ్జీ సీటులో కూర్చొని.. అడ్డంగా బుక్కయ్యాడు!

Submitted by arun on Mon, 07/02/2018 - 17:27
selfie

శిక్షణలో ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్ సెల్ఫీ మోజులో.. జడ్జి చైర్‌లో కుర్చుని సెల్ఫీలు దిగాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. రామ్‌ అవతార్‌ రావత్‌ అనే వ్యక్తి ఉమారియా పోలీస్‌ అకాడమీలో ట్రైనీగా ఉన్నాడు. శనివారం రోజు జిల్లా కోర్టుకు వెళ్లిన రావత్‌.. కోర్టు ప్రాగణంలోని న్యాయమూర్తి గది తెరచి ఉండటంతో అందులోకి వెళ్లాడు. న్యాయమూర్తి సీటులో కూర్చొని సెల్ఫీలు దిగసాగాడు. రావత్‌ సెల్ఫీలు దిగడాన్ని గమనించిన గుమస్తా శక్తిసింగ్‌ ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. దీంతో కొత్వాలి పోలీసులు రావత్‌పై కేసు నమోదు చేశారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

English Title
Trainee policeman arrested for taking selfie in judge’s chair in Madhya Pradesh’s Umaria

MORE FROM AUTHOR

RELATED ARTICLES