కొండగట్టులో ప్రాణాలు తీసిన మృత్యు మలుపు

కొండగట్టులో ప్రాణాలు తీసిన మృత్యు మలుపు
x
Highlights

అదో మృత్యు మలుపు. ఏ మాత్రం ఏమరు పాటుగా ఉన్నా..ప్రాణాలు తీసే టర్నింగ్ అది. గతంలో ఆ ప్రదేశంలో ఎన్నో ప్రమాదాలు జరిగి... ఎంతో మంది ప్రాణాలు పోయాయి....

అదో మృత్యు మలుపు. ఏ మాత్రం ఏమరు పాటుగా ఉన్నా..ప్రాణాలు తీసే టర్నింగ్ అది. గతంలో ఆ ప్రదేశంలో ఎన్నో ప్రమాదాలు జరిగి... ఎంతో మంది ప్రాణాలు పోయాయి. ఇప్పుడు... అదే మలుపు...మృత్యు మార్గంగా మారింది. 57 మంది ప్రాణాలను అనంత వాయువుల్లో కలిపేసింది.

కొండగట్టు దగ్గర బస్సు ప్రమాదానికి ఘాట్ రోడ్డు మలుపే ప్రధాన కారణం. ఘాట్ రోడ్డులో ఉన్న మూల మలుపే మృత్యు ద్వారంగా మారింది. 88 మందితో వెళ్తున్న ఆర్టీసీ బస్సు కొండగట్టు ఘాట్‌ రోడ్డులోని చివరి మూల మలుపు దగ్గరే ప్రమాదానికి గురైంది. జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కొండగట్టు మీద నుంచి కిందకు వస్తున్న సమయంలో అదుపు తప్పింది. బస్సు ఘాట్ రోడ్డులో వేగంగా దిగుతున్న సమయంలో దారి చివర్లో మలుపు ఉండడం ఆ టర్నింగ్‌కు ముందుకు స్పీడ్‌ బ్రేకర్‌ కూడా ఉండడంతో అదుపు తప్పి లోయలో పడింది.

2017లో కొండగట్టు ఘాట్ రోడ్డులో ఇదే మలుపు దగ్గర ఓ లారీ కూడా ప్రమాదానికి గురైంది. లారీ బోల్తా పడిన ఘటనలో 20 మంది మృతి చెందారు. ఇప్పుడు బస్సు ప్రమాదం జరిగిన ప్రదేశం దగ్గర్లోనే లారీ ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ కూడా ఘాట్ రోడ్డు మలుపును గమనించకపోవడం కంగారుగా సడెన్ బ్రేక్ వేయడంతో.. లారీ బోల్తా కొట్టింది. 20 మందిని విగత జీవులుగా మార్చింది. ఆ తర్వాత ఇదే మలుపు దగ్గర ఓ ఆటో కూడా ప్రమాదానికి గురైంది. వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా..అధికారులు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదు.

2017 నాటి లారీ ప్రమాదం తర్వాత ఇంతటి పెద్ద ప్రమాదం చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. లారీ ప్రమాదం జరిగినప్పుడే అధికారులు ఈ ఘాట్‌ రోడ్డుపైకి భారీ వాహనాలను నిషేదించారు. భారీ వాహనాలను నిషేధించినట్లుగా..హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. అయినా ఆర్టీసీ అధికారులు షార్ట్‌ కట్‌గా భావించి ప్రమాదకరమైన ఘాట్‌రోడ్డులోనే బస్సుల్ని నడిపిస్తున్నారు. ఈ నిర్లక్ష్యమే దేశ చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదానికి కారణమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories