అమర్నాథ్‌ యాత్రలో అపశృతి

Submitted by arun on Tue, 07/03/2018 - 14:16
amarnath

అమర్‌నాథ్ యాత్రలో అపశృతి దొర్లింది. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన పశ్చిమగోదావరి జిల్లా చాగల్లుకు చెందిన తోట రత్నం అనే వృద్ధురాలు గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన బలకేజ్ బేస్ క్యాంప్‌లో జరిగినట్లు అధికారులు తెలిపారు. నాలుగు రోజుల క్రితమే రత్నం రాజమండ్రి వారితో కలిసి యాత్రకు వెళ్లినట్లు సమాచారం. రత్నం మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులకి అధికారులు సమాచారం అందించారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతదేహాన్ని చాగల్లుకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

English Title
tragedy amarnath yatra

MORE FROM AUTHOR

RELATED ARTICLES