పొత్తులపై ఇప్పటి వరకు చర్చ జరగలేదన్న ఉత్తమ్

Submitted by arun on Thu, 09/06/2018 - 09:25

ఇవాళ శాసన సభ రద్దవుతుందన్న అంచనాల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు అలెర్ట్ అయ్యారు. ఇప్పటికే ఏకంగా ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటించిన టీ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహాలు, గ్రేటర్ హైదరాబాద్‌లో ఎక్కువ సీట్లు గెలవడంతో పటు సోనియా టూర్ వంటి అంశాలపై కసరత్తు చేస్తోంది. అంతేకాదు ఇక శాసనసభ రద్దయిన కొద్ది సేపట్లోనే అత్యవసర మీటింగ్ కి టీపీసీసీ పిలుపునిచ్చింది. సీనియర్  నేతలంతా అందుబాటులో ఉండాంటూ టీపీసీసీ కోరింది.  

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ పార్టీ మారతారనే ప్రచారం జరుగుతున్న తరుణంలో ఆయన ఇంట్లో కీలక భేటీ జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు ముఖేష్ గౌడ్ ఇంట్లో సమావేశమయ్యారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ భట్టి విక్రమార్క, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, డీకే. అరుణ, రేవంత్ రెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, మధుయాష్కీ గౌడ్ విందు సమావేశానికి వచ్చా రు. కంటికి ఆపరేషన్ జరగడంతో జానారెడ్డి ఈ సమావేశానికి దూరంగా ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీనీ రద్దు చేస్తే కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. 

తమ భేటీకి ప్రాధాన్యత ఏమీ లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్న అంశంపై ఇప్పటి వరకు టీకాంగ్రెస్ చర్చించలేదన్న ఉత్తమ్ భవిష్యత్ లోనూ పొత్తులపై చర్చ జరగొచ్చు జరగకపోవచ్చని వ్యాఖ్యానించారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 అసెంబ్లీ సీట్లు ఉన్న దృష్ట్యా వాటిని ఎలా కైవశం చేసుకోవాలన్న అంశంపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. ముందస్తు ఎన్నికల హడావిడి నేపథ్యంలో సోనియాగాంధీ సభ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. సోనియా తెలంగాణ టూర్  దాదాపు ఖాయమైనా త్వరలోనే తేదీని కూడా ఖరారు చేస్తారని తెలుస్తోంది. 

English Title
TPCC Leaders Meeting On Assembly Dissolution and Early Elections in Mukesh Goud's House

MORE FROM AUTHOR

RELATED ARTICLES