కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితా రేపు విడుదల చేస్తాం

Submitted by arun on Thu, 11/08/2018 - 13:16

తెలంగాణ కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేసిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ల అభ్యర్థుల జాబితా అంశాలపై సంప్రదింపులు, చర్చలు కొనసాగుతున్నాయని జాబితాపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఉత్తమ్ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రేపు విడుదల చేస్తామని తెలిపారు. న్యూస్ ఛానల్స్ లో సామాజిక మాధ్యమాల్లో , పత్రికల్లో వస్తున్న జాబితాలు నిజం కాదని తేల్చి చెప్పారు. ప్రచారంలో ఉన్న జాబితాలు నిజం కాదని నాయకులు, కార్యకర్తలు వాటిని నమ్మవద్దని ఉత్తమ్ కుమార్ కోరారు. 


 

English Title
TPCC Chief Uttam Kumar Reddy Clarification On Seats Mahakutami Yet Not Decided

MORE FROM AUTHOR

RELATED ARTICLES