టచ్ చేసి చూడు సినిమా రివ్యూ

టచ్ చేసి చూడు సినిమా రివ్యూ
x
Highlights

రాజాది గ్రేట్ తో త‌న స్టామీనా ఏంటో నిరూపించుకున్న ర‌వితేజ టచ్ చేసి చూడుతో శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తున్నాడు. రైటర్ వ‌క్కంతం వంశీ క‌థ‌తో...

రాజాది గ్రేట్ తో త‌న స్టామీనా ఏంటో నిరూపించుకున్న ర‌వితేజ టచ్ చేసి చూడుతో శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తున్నాడు. రైటర్ వ‌క్కంతం వంశీ క‌థ‌తో డైర‌క్ట‌ర్ విక్ర‌మ్ సిరికొండ ఈ సినిమాను తెరకెక్కించాడు. మ‌రి దాదాపు రెండు సంవత్స‌రాల త‌రువాత రాజాదిగ్రేట్ తో హిట్ కొట్టిన మాస్ మ‌హ‌రాజా అదే జోరును కొన‌సాగిస్తాడా లేదా అనేది తెలుసుకుందాం.

కథ : పోలీస్ ఆఫీస‌ర్ గా ఉన్న కార్తీకేయ(రవితేజ) గా అకార‌ణంగా ఓ నిందితుడి మ‌ర‌ణానికి కార‌ణ‌మైనందుకు ఉద్యోగం నుంచి స‌స్పెండ్ అవుతాడు. అయితే ఉద్యోగం నుంచి స‌స్పెండ్ అయిన కార్తీకేయ పాండిచ్చేరిలో సొంత‌గా కంపెనీ స్టార్ట్ చేస్తాడు. ఒక రోజు కార్తీకేయ చెల్లెలు విద్యార్ది నాయ‌కుడిని హ‌త్య‌ను క‌ళ్లారా చూస్తుంది. అదేవిష‌యాన్ని అన్న‌తో చెప్ప‌డంతో చెల్లెలితో సాక్ష్యం చెప్పించేందుకు పోలీస్టేష‌న్ కు వెళ‌తాడు. అక్క‌డ త‌న చెల్లి చెప్పిన నిందితుల్ని ఇర్ఫాన్‌ లాలా(ఫ్రెడ్డీ దారువాలా) గుర్తించిన కార్తీకేయ షాక్ తింటాడు. తాను చంపిన వ్య‌క్తి ఇక్క‌డ ప్ర‌త్యేక్ష‌మ‌వ్వ‌డం ఏంటీ..? బ‌్ర‌తికి ఉన్న ఇర్ఫాన్ లాలాను చనిపోయిన‌ట్లు ఎందుకు చూపించారు. పోలీస్ ఆఫీసర్ గా ఉన్న కార్తికేయ‌కు ఇర్ఫాన్‌కు గొడవేంటి..? అన్నదే తెరపైన చూడాల్సిందే.

నటీనటులు : రవితేజ ఎనర్జిటిక్ బాగున్నా కొత్త‌సీసాలో పాత‌సారాయి అన్న చందంగా గ‌తంలో ఉన్న సీన్లే ఇక్క‌డ ప్ర‌త్యేక్ష‌మ‌వ్వ‌డం కొత్తదనమేమీ కనిపించదు. హీరోయిన్స్ రాశీఖన్నాయాక్టింగ్ . సీరత్‌కపూర్ అందాలు ఆర‌బోసే ప్ర‌య‌త్నం చేసినా లాభం లేక‌పోయింది. మిగిలిన తారాగ‌ణం జయప్రకాష్, మురళీ శర్మ, వెన్నెల కిశోర్‌, సత్యం రాజేష్‌లు ఎవ‌రి ప‌రిధిల‌మేర వారు రాణించారు. విల‌న్ గా ఫ్రెడ్డీ దారువాలా యాక్టింగ్ బాగున్నా క‌థ‌లో స్కోప్ లేక‌పోయింది. విలనిజం పెద్దగా ఎలివేట్‌ కాలేదు.

విశ్లేషణ : స్టార్ రైట‌ర్ ఉన్నాడ‌నే దీమాతో ర‌వితేజ్ రొటీన్ సినిమాను విక్రమ్ సిరికొండతో తెర‌కెక్కించాడు. కానీ లాభం లేక‌పోయింది. యాక్ష‌న్ సీన్స్ బాగున్నా..డైర‌క్ట‌ర్ రొమాంటిక్‌ కామెడీ సీన్స్ మీద దృష్టి పెట్టాడు. ఫ‌స్టాఫ్ అంతా సాగ‌దీత స‌న్నివేశాలు ..సెకెండ్ ఆఫ్ లో ఆస‌క్తిక‌రంగా మొద‌లు పెట్టినా ఆ ఊపు మ‌ళ్లీ క‌నిపించ‌లేదు. సంగీతం సోసోగా ఉంది. .తన నేపథ్య సంగీతంతో మణిశర్మ సినిమాను కాస్త కాపాడే ప్రయత్నం చేశాడు.
ప్లస్ పాయింట్స్ :
రవితేజ ఎనర్జీ
రొమాంటిక్ కామెడీ
మైనస్ పాయింట్స్ :
పాత సీసాలో కొత్త‌సారా


Show Full Article
Print Article
Next Story
More Stories